Breaking News

Monthly Archives: December 2024

మొక్కలు నాటి ప్రకృతితో మమేకమవుదాం

-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చెట్లు పెంచుతూ, సేంద్రీయ సాగు చేస్తూ ప్రకృతితో మమేకమవుదామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. చెట్ల పెంపకంతోనే ఆరోగ్యంతో కూడిన ఆయువు లభిస్తుందని వెల్లడించారు. నగరంలోని మొగల్రాజపురంలో ఈ నెల 21 నుంచి ప్రారంభమైన ఏపీ ఫ్లవర్ షో ను మంత్రి సవిత మంగళవారం సందర్శించారు. ఫ్లవర్ షో ఏర్పాటు చేసిన 70 స్టాళ్లను మంత్రి తిలకించారు. ప్రతి స్టాల్ దగ్గరకెళ్లి …

Read More »

హైందవ శంఖారావానికి తరలిరండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం వద్ద గల కేసరపల్లి గ్రామంలో జనవరి 5వ తేదీన జరుగబోయే హైందవ శంఖారావం మహాసభకు రాజకీయ పార్టీల, కులాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి హిందూ బందువులు అంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ పిలుపు నిచ్చారు. మంగళవారం గాంధీనగరలోని ప్రెస్ క్లబ్లో శంఖారావం పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం మద్దతు తెలపాలని …

Read More »

సృజనాత్మక ఆలోచనలున్న యువతకు మీడియా & వినోద రంగంలో గొప్ప అవకాశాలు… : పీఐబీ ఏడీజీ రాజిందర్ చౌదరి

-విజయవాడ ఎస్‌పీఏలో యువ సంగమ్‌ కార్యక్రమం -పీఐబీ ఏడీజీ & ఎస్‌పీఏవీ అధ్యాపకులతో ఉత్తరప్రదేశ్‌ యువ సంగమ్‌ ప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమాలు & కెరీర్‌, సంస్కృతి, ఏక్ భారత్ శ్రేష్ఠ్‌ భారత్‌పై చర్చలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మీడియా & వినోద రంగంలో ఉద్యోగాల కల్పన & వ్యవస్థాపక సామర్థ్యాలకు గొప్ప అవకాశాలు ఉన్నాయని పీఐబీ ఏడీజీ రాజిందర్ చౌదరి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ సంగమ్‌ ప్రతినిధులతో మాట్లాడిన చౌదరి, భారత ప్రభుత్వం “వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025” …

Read More »

సంజా ఉత్సవ్ ఎస్ హెచ్ జి మేళా పోస్టర్ విడుదల

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో సంజా ఉత్సవ్ ఎస్ హెచ్ జి మేళ 2024, పోస్టర్ను అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారులతో లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు డిసెంబర్ 26 నుండి 30, 2024 వరకు ఈ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళా లో …

Read More »

నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలను మంగళవారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల కోరిక ఏదీ అసంపూర్ణంగా మిగిలిపోకూడదని , ఏ కల నెరవేరకుండా ఆగిపోకూడదని, ఈ క్రిస్మస్ అందరికి అంతులేని ఆనందాన్ని ఇవ్వాలని, ప్రజల హృదయంలోని ప్రతి కల నెరవేరాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ క్రిస్మస్ నగర …

Read More »

అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి…. : కమిషనర్ ధ్యాన చంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్ష విరమణల కోసం వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. మంగళవారం ఉదయం భవాని దీక్ష విరమణ విధులు నిర్వహిస్తున్న అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సిబ్బంది మొత్తం మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవాని దీక్షల విరమణ సందర్భంగా భక్తులకు త్రాగునీటి సరఫరా లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటివరకు 6,50,000 బాటిళ్లను 6,30,000 …

Read More »

మీరు అయిదేళ్లలో చేయని అభివృద్ధి కేవలం 5 నెలల్లోచేశాం

-మంత్రులు సవిత, శ్రీనివాస్ -దమ్ముంటే చర్చకు రండి -జగన్ కు మంత్రి సవిత సవాల్ -రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ పాలన అంతా అప్పులమయమేనని, అయిదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధి మేం కేవలం 5 నెలల కాలంలోనే చేసి చూపించామని, చంద్రబాబు అంటేనే బ్రాండ్ అని, ఇందుకు రాష్ట్రానికి తరలొస్తున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులే నిదర్శమని మంత్రులు సవిత, కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తాము 5 నెలల …

Read More »

సిడాప్ సిఇఓగా బాధ్యతలు స్వీకరించిన పాలడుగు నారాయణ స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యాపార అభివృద్ది సంస్ధ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఎపి -సీడాప్) ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పాలడుగు నారాయణ స్వామి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టేషన్ ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు పరిపాలనాభవనంలోని సిడాప్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. 2022 నవంబరు నుండి రాజ్ భవన్ లో గవర్నర్ ఉప కార్యదర్శిగా నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. మానవవనరుల శాఖ మంత్రి …

Read More »

పి.ఎమ్.కె.వి.వై 4.0 కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ 539 స్కిల్ హబ్‌లు ఏర్పాటు

-కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (స్వతంత్ర బాధ్యత) స‌హాయ మంత్రి జయంత్ చౌదరి వెల్ల‌డి -పి.ఎమ్.కె.వి.వై 4.0 కింద స్కిల్ హ‌బ్ సెంట‌ర్స్ ఏర్పాటు పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) 4.0 అమలులోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు దేశ‌వ్యాప్తంగా 6,835 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేయ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొత్తం 539 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసిన‌ట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (స్వతంత్ర బాధ్యత) స‌హాయ …

Read More »

నూత‌న రాజ్యస‌భ స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్య స‌భ‌కు నూత‌నంగా ఎన్నికైన సానా స‌తీష్ బాబు, బీద మ‌స్తాన్, ఆర్. కృష్ణ‌య్య ల ప్ర‌మాణా స్వీకారాన్ని పార్ల‌మెంట్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ త‌న స‌హ‌చ‌ర‌ ఎన్డీయే ఎంపిల‌తో క‌లిసి వీక్షించారు. రాజ్య స‌భ ఎంపీలుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ సానా స‌తీష్ బాబు, బీద మ‌స్తాన్, ఆర్. కృష్ణ‌య్య లకు కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తో పాటు ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం …

Read More »