Breaking News

సృజనాత్మక ఆలోచనలున్న యువతకు మీడియా & వినోద రంగంలో గొప్ప అవకాశాలు… : పీఐబీ ఏడీజీ రాజిందర్ చౌదరి

-విజయవాడ ఎస్‌పీఏలో యువ సంగమ్‌ కార్యక్రమం
-పీఐబీ ఏడీజీ & ఎస్‌పీఏవీ అధ్యాపకులతో ఉత్తరప్రదేశ్‌ యువ సంగమ్‌ ప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమాలు & కెరీర్‌, సంస్కృతి, ఏక్ భారత్ శ్రేష్ఠ్‌ భారత్‌పై చర్చలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మీడియా & వినోద రంగంలో ఉద్యోగాల కల్పన & వ్యవస్థాపక సామర్థ్యాలకు గొప్ప అవకాశాలు ఉన్నాయని పీఐబీ ఏడీజీ రాజిందర్ చౌదరి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ సంగమ్‌ ప్రతినిధులతో మాట్లాడిన చౌదరి, భారత ప్రభుత్వం “వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025” (వేవ్స్-2025) నిర్వహిస్తోందని, ఇది సృజనాత్మక ఆలోచనలు కలిగిన యువతకు కొత్త ద్వారాలు తెరుస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వ చొరవ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్‌ భారత్’ (ఈబీఎస్‌బీ) కింద, విజయవాడలోని ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌’లో ఏర్పాటు చేసిన యువ సంగమ్‌లో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం, దేశంలోని వివిధ రాష్ట్రాలకు యువతకు విజ్ఞానాన్వేషణ పర్యటన వంటింది.

ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు & నిపుణులతో కూడిన యువకులు యువ సంగమ్‌ బృందంలో ఉన్నారు. ఈబీఎస్‌బీలో, ఉత్తర ప్రదేశ్‌ జత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు న్యూదిల్లీలో జరగనున్న వేవ్స్‌-2025 గురించి యువ సంగమ్‌లో ఆయన ఒక ప్రదర్శన ఇచ్చారు.

2.60 ట్రిలియన్ డాలర్ల విలువైన వినోద రంగం మార్కెట్‌లో ఉద్యోగాలు & వ్యవస్థాపక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వేవ్స్‌ కీలక అడుగుగా మారుతుందని శ్రీ చౌదరి చెప్పారు. పరిశ్రమ-ఆధారిత వేవ్స్-2025లో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు, యువకులు పాల్గొనాలని సూచించారు. ఈ రంగంలోని అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విజయవాడ ఎస్‌పీఏ రిజిస్ట్రార్ & డీన్ (స్టుడెంట్‌ అఫైర్స్‌) ప్రొ. డా. అయోన్ కె తరఫ్దార్ మాట్లాడుతూ, విభిన్న సంస్కృతులపై అనుభవం ద్వారా అవగాహన కల్పించడం యువ సంగమ్‌ లక్ష్యమని చెప్పారు.

డా. వెంకట కృష్ణ కుమార్ సాధు, డీన్ (స్టుడెంట్‌ అఫైర్స్‌) & ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ప్రొ. ఎం భాను చిత్ర, డీన్ (రీసెర్చ్‌), ఎస్‌పీఏ విజయవాడ, ఆర్ రమేష్ చంద్ర, అసిస్టెంట్ డైరెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కూడా యువ సంగమ్‌లో పాల్గొన్నారు.

యువ సంగమ్‌లో పాల్గొన్న యువతకు కొండపల్లి చెక్క బొమ్మలు, ధృవపత్రాలను అందించారు. వీళ్లు, 7 రోజుల యువ సంగమ్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. వేవ్స్‌-2025 ఫోటో బూత్‌లో వారికి ఇష్టమైన హాస్య, గేమింగ్ & చలనచిత్ర పాత్రలతో ఫోటోలు దిగారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *