Breaking News

రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1 కోటి విరాళం ఇచ్చిన ఇందుపల్లికి చెందిన విజయలక్ష్మి

-తన తల్లి కోగంటి ఇందిరాదేవి పేరిట రాజధాని కోసం రూ.1 కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1 కోటి విరాళంగా అందించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఈ మేరకు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదారాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో రూ.1 కోటి విరాళంగా ఇచ్చామన్నారు. తమ తల్లి ఇందిరాదేవికి పేరిట ఆవిడ కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్‌లో తమకున్న స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్టు పి విజయలక్ష్మి చెప్పారు. పి విజయలక్ష్మి త్యాగనిరతిని, స్ఫూర్తిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. స్థలం అమ్మి తల్లిపేరిట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కోగంటి ఇందిరాదేవి గతంలో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా ఉన్నారు. గతంలో విజయనగరంలో గోశాలకు విజయలక్ష్మి, ఇందిరాదేవి విరాళాలు ఇచ్చారు. విజయలక్ష్మి రూ.1 కోటి విరాళం చెక్కును తమ బంధువైన కె రవీంద్రకుమార్‌తో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *