Breaking News

విరివిగా క్రీడా పోటీలు జరగాలి..

-ఫిబ్రవరి 1 నుండి 3 వరకు కాకినాడలో క్రీడ పోటీలు
-ఏపీ స్టేట్ మాస్టర్స్ అధ్లెటిక్ చాంపియన్ షిప్ 2024-25 గోడపత్రిక ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ర్ట వ్యాప్తంగా క్రీడా పోటీలు విరివిగా జరగాలని క్రీడల వెైపు అన్నీ వయస్సుల వారు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలలో ఏపీ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ వారు ఫిబ్రవరి 01 నుంచి 03 వరకు నిర్వహిస్తున్న 23 క్రీడలకు సంబంధించిన క్రీడ పోటీల పోస్టర్ ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి సచివాలయంలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీలలో 30 సంవత్సరాల నుండి 105 సంవత్సరాల వరకు అందరు పాల్గొనే విధంగా ప్రతి 5 సంవత్సరాల కేటగిరి వారిని ఒక గ్రూపు చొప్పున అందరూ పాల్గొనే విధంగా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీపతి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సేకం రాంప్రసాద్ రెడ్డి అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *