Breaking News

Monthly Archives: December 2024

మీకోసంలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలు కరెక్ట్ గా క్లాసిఫికేషన్ జరగాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలు కరెక్ట్ గా క్లాసిఫికేషన్ జరగాలని, సరైన ఎండార్స్మెంట్ తో పరిష్కరించాలని, తద్వారా రీఓపెన్ కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జయలక్ష్మి మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీల పరిష్కారం, నీటి తీరువా వసూళ్లు, భూముల …

Read More »

జనవరి నుంచి 30 వేల కోట్లతో అమరావతి లో నిర్మాణాలు

-ఆటో డ్రైవర్లకు, కూలీలకు స్వర్ణయుగమే. -18వ డివిజన్ లో ఆటో స్టాండ్, పార్టీ జెండా దిమ్మను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.30 వేల కోట్లతో జనవరి నుంచి అమరావతిలో అద్భుతమైన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాణి గారి తోట కనకదుర్గమ్మ వారిధి దగ్గర శ్రీ కనకదుర్గమ్మ …

Read More »

కొండ ప్రాంత వాసులకు పుష్కలంగా నీరు

-కొండ ప్రాంతాల్లో మరో నాలుగు వాటర్ ట్యాంకులు నిర్మాణం చేస్తాం -ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం -5 వ డివిజన్ లో వాటర్ ట్యాంక్, రోడ్డుపనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ క్రీస్తు రాజ పురం. ఆర్.సీ.ఎం. చర్చి వెనుక కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ పనులకు, జయప్రకాష్ నగర్ మూడో లైను రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె …

Read More »

ధాన్యం కొనుగోళ్లల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కుందావారి కండ్రికలో కల్లాలు, రహదారులపై నిల్వ ఉంచిన ధాన్యాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులకు ప్రభుత్వం నుంచి సరైన భరోసా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు …

Read More »

ఫెంగల్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని అధికారులకు సీఎం సూచన -జిల్లాల్లో తాజా పరిస్థితిని, సహాయక చర్యలను వివరించి అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫెంగల్ తుఫాను ప్రభావం, ప్రభుత్వ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం నిర్వహించిన సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావంతో గత 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 ఎంఎం వర్షపాతం …

Read More »

గ్రామ-వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఫోకస్

-సమర్థవంతమైన సేవలు అందించేలా తీర్చిదిద్దే అంశంపై కసరత్తు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ – వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి, మరింత అర్థవంతంగా, పటిష్టంగా ఈ వ్యవస్థను తయారు చేసి ప్రజలకు ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం జీఎస్‌డబ్ల్యూఎస్ పై తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. అటు గ్రామాల్లోనూ – ఇటు పట్టణ, నగర ప్రాంతాల్లోనూ సచివాలయాలు ప్రజలకు మరింత చేరువై, ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలనే …

Read More »

అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులకు టెండ‌ర్లు పిలిచేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం

-మొత్తం 11,467 కోట్ల మేర టెండ‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన అథారిటీ -సీఎం చంద్ర‌బాబు అథ్య‌క్ష‌త‌న జ‌రిగిన 41వ సీఆర్డీఏ అథారిటీ స‌మావేశం -భ‌వ‌నాలు,రోడ్లు,మౌళిక వ‌స‌తులు చేప‌ట్టేందుకు అనుమ‌తులు -ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన విధంగా మూడేళ్ల‌లో అమ‌రావ‌తి పూర్తి -అథారిటీ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించిన మంత్రి నారాయ‌ణ‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులు చేప‌ట్టేందుకు సీఆర్డీఏ అధారిటీ స‌మావేశం ఆమోదం తెలిపింది…మొత్తం 11,467 కోట్ల మేర ప‌నుల‌కు అథారిటీ ఆమోదం తెలిపిన‌ట్లు మున్సిప‌ల్ శాఖ …

Read More »

ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు మరియు భవననాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రహిత రహదారులే లక్ష్యంగా జరుగుతున్న మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పర్యటిస్తోన్నారు. ఇప్పటికే అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించిన మంత్రి.. రహదారుల మరమ్మతు పనుల పర్యవేక్షణలో …

Read More »

డ్రోన్ స్టార్ట‌ప్‌ల‌కు రూ.5 ల‌క్ష‌ల ప్రోత్సాహ‌కాలు

-ఏపీ డ్రోన్ క్యాపిట‌ల్‌గా అవ‌త‌రించ‌బోతోంది -ఈ రంగంలో అపార అవ‌కాశాలు ఎదురు చూస్తున్నాయి -యువ‌త అవ‌కాశాల‌ను అందింపుచ్చుకోవాలి -ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ సీఎండీ కె. దినేష్ కుమార్ పిలుపు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ రంగంలో స్టార్ట‌ప్‌లు పెట్ట‌డానికి ముందుకొచ్చే యువ‌త‌కు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రోత్స‌హ‌కాలు ఇస్తుంద‌ని ఈ అవ‌కాశాన్ని యువ‌త అందిపుచ్చుకోవాల‌ని ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సీఎండీ కె. దినేష్ కుమార్ అన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడలోని ధ‌నేకుల ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో అడ్వాన్స్డ్ …

Read More »

అర్జీల ప‌రిష్కార నాణ్య‌త‌లో రాజీప‌డొద్దు

– స‌మ‌స్య‌కు మూల‌కార‌ణాన్ని గుర్తించి, గ‌డువులోగా ప‌రిష్క‌రించండి – శాఖ‌ల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారుల నియామ‌కం – ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కార వ్య‌వ‌స్థకు 97 అర్జీలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా స‌మ‌స్య చిన్న‌దైనా.. పెద్ద‌దైనా స‌మాన ప్రాధాన్య‌మిచ్చి గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని, నాణ్య‌త‌లో రాజీప‌డొద్ద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు సూచించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో నిర్వ‌హించిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వ్య‌వ‌స్థ (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మంలో …

Read More »