Breaking News

మీకోసంలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలు కరెక్ట్ గా క్లాసిఫికేషన్ జరగాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలు కరెక్ట్ గా క్లాసిఫికేషన్ జరగాలని, సరైన ఎండార్స్మెంట్ తో పరిష్కరించాలని, తద్వారా రీఓపెన్ కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జయలక్ష్మి మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీల పరిష్కారం, నీటి తీరువా వసూళ్లు, భూముల రీ సర్వేపై ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కారం, ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ తమ నివాసం నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రజల నుండి అందే గ్రీవెన్స్ లో ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధించినవి కావటం చేత రెవెన్యూ పిటిషన్స్ స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వస్తున్న రెవెన్యూ పిటిషన్స్ తగ్గించాలని సిసిఎల్ఏ కలెక్టర్లకు సూచించగా, కలెక్టరేట్లో మీకోసం హాలు ప్రక్కనే సేవల కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భూ కబ్జాలకు, భూ ఆక్రమణలకు మధ్య తేడా గమనించి కరెక్ట్ క్లాసిఫికేషన్ చేసి సంబంధిత విభాగాలకు పరిష్కారం నిమిత్తం పంపాల్సి ఉంటుందని అధికారులతో అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను పరిరక్షించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ నెలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించుటకు సన్నద్ధం కావాలని, జనవరిలో సంక్రాంతి తర్వాత ప్రభుత్వం జన్మభూమి నిర్వహించనున్నదని అందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

ఈ సమావేశంలో డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, గ్రీవెన్స్ సెల్ సూపర్నెంట్ బేగ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *