మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రతిష్ట పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని అన్నారు. జిల్లా కలెక్టర్ గురువారం ఆర్డీవోలు తాసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓ లు, వీఆర్వోలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో రెవెన్యూ సదస్సులు, మెగా పేరెంట్స్ డే కార్యక్రమాల నిర్వహణపై మార్గ నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ …
Read More »Monthly Archives: December 2024
ధాన్యం సేకరణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ, రెవెన్యూ శాఖ సిబ్బంది, అధికారులను హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి తహసిల్దార్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఇతర రెవెన్యూ సిబ్బందితో ధాన్యం సేకరణ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవా …
Read More »స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు
-స్వచ్ఛత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ సర్వేలన్స్ అవసరం – పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు వేస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ సర్వేలన్స్ అవసరంఅని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్వచ్ఛ విజయవాడ కొరకు సాంకేతిక నిపుణులతో సమావేశం …
Read More »నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించాలని, జి.ఒ.ఎం.ఎస్.నెం-114ను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ కోరింది. బుధవారం ధర్నాచౌక్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నిర్వహించిన నిరసన దీక్షలో రాష్ట్ర అధ్యక్షులు బి.ఎస్.ఆర్.శర్మ, జనరల్ సెక్రెటరీ బి.జె.గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని జి.ఓ.ఎం.ఎస్.నెం. 114ను విడుదల చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరు. క్రమబద్ధీకరణ అయ్యారు దురదృష్టవశాత్తు విద్యావ్యవస్థలోని కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రమే …
Read More »రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి లో మౌలిక వసతులు కల్పించి, రోగులకు మెరుగైన సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు ఆన్ని ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ఆసుపత్రి లో వైద్య సదుపాయాల కల్పన పై డి సి హెచ్ ఎస్ ఆనంద మూర్తి సూపింటెండెంట్ల, మెడికల్ ఆఫీసర్లు తో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »విపత్తులు రాకముందే ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేస్తూ అప్రమత్తం చేయాలి.
– ఆపద మిత్ర కమిటీని జిల్లాలలో ఏర్పాటు చేయాలి. – జిల్లాలలో ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ తో చర్చించి ప్రకృతి వైపరీత్యాల పై నివేదికలు సమర్పించాలి : రాష్ట్ర హోంమంత్రి మతి వెలగపూడి అనిత. తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : బుదవారం సాయంత్రం మంగళగిరి సచివాలయం నుండి రాష్ట్ర హోంమంత్రి శ్రీ మతి వి.అనిత అన్ని జిల్లాల కల్లెక్టర్లు, ఎస్పిలతో మరియు సంబందిత అధికారులతో ముందస్తు చర్యల నిమిత్తం విపత్తుల నివారణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా …
Read More »ఏపీలో ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెవెన్యూ సదస్సులు
తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని గౌ. రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జెసి శుభం బన్సల్ తో కలిసిపాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఎస్డిసి …
Read More »ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయము
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌ. వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, విజయవాడ వారి ఆదేశాల మేరకు, ది 04-12-2024 న మధ్యాహ్నం పౌరసఫారాల సంస్థ కేంద్ర కార్యాలయ సిబ్బంది అయిదు బృందాలుగా కృష్ణ జిల్లా లోని పలు మండలాలో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించటం జరిగింది.సదరు తనిఖీలలో ముఖ్యాంశాలు ఏమనగా, మిల్లు ఆవరణ లో ఉన్న ధాన్యము వాహానములు దిగుమతి చేసుకోవటం లో జాప్యం జరుగుచున్నధనియు మరియు పలు …
Read More »యుద్ధ వీరులకు పూజించే సంప్రదాయం కారంపూడిలో ఉంది
-కులమతాలకు అతీతంగా చాపకూడు కార్యక్రమం అందరికీ ఆదర్శం -పల్నాడు వీరుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలి -పల్నాడు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి -900 ఏళ్ల పల్నాడు వీరుల చరిత్ర రాష్ట్రానికే గర్వకారణం – మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కారంపూడి, నేటి పత్రిక ప్రజావార్త : 900 సంవత్సరాలపై బడిన పల్నాడు యుద్ధ వీరుల చరిత్ర రాష్ట్రానికే గర్వ కారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో బుధవారం పల్నాటి యుద్ధ వీరుల ఆరోధనాత్సవాల్లో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో …
Read More »200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్
-అర్హులందరికీ ఉచిత విద్యుత్ పథకం అమలు -అడ్డంకులు సృష్టించేందుకే అసత్యాలు, అపోహలు ప్రచారం – విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయం: అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News