Breaking News

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి లో మౌలిక వసతులు కల్పించి, రోగులకు మెరుగైన సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు ఆన్ని ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ఆసుపత్రి లో వైద్య సదుపాయాల కల్పన పై డి సి హెచ్ ఎస్ ఆనంద మూర్తి సూపింటెండెంట్ల, మెడికల్ ఆఫీసర్లు తో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రి లో మౌలిక వసతులు కల్పించి, రోగులకు మెరుగైన సేవలు అందించాలి అని అన్నారు. ప్రతిరోజు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పేషెంట్లు రావడం జరుగుతుందని, వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్య సేవలు అందించాలని తెలిపారు. త్రాగునీటి వసతి, ఆక్సిజన్ సరఫరా, జనరేటర్, అదనపు గదులు వంటి సదుపాయాల కొరత లేకుండా పనులు పూర్తి చేయాలని తెలిపారు. రోగులకు చికిత్స నిమిత్తం వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *