విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భోగి పండుగ అనేది ఆనందం, సంప్రదాయం, సంతోషాన్ని పంచుకునే పర్వదినం. మరి ఆ పండుగను పర్యావరణహితంగా జరుపుకుందాం – భోగి మంటల్లో ప్రమాదకర వ్యర్థాలు వేయకుండా పర్యావరణాన్ని కాపాడుకుందాం అని రాష్ర్ట ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి.క్రిష్ణయ్య. శీతాకాలంలో సాధారణంగా గాలిలో ధూళిరేణువులు నిలకడగా ఉండి పొగమంచు రూపంలో కొంత వరకూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీనికి తోడుగా భోగి మంటలు వేయడం, వ్యర్థాలను కాల్చడం వల్ల …
Read More »Daily Archives: January 10, 2026
గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులను గన్నవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విగ్రహాన్ని క్రేన్ సహాయంతో పీఠంపై అమర్చుతున్న ప్రక్రియను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ విగ్రహం గన్నవరం నడిబొడ్డున ఒక విశిష్ట గుర్తింపుగా నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విగ్రహం చుట్టూ …
Read More »ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్
-ప్రజాదర్భార్ లో వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం -పశ్చిమ నియోజకవర్గ టిడిపి నాయకులు వెల్లడి -అర్జీలతో భారీగా తరలివచ్చిన ప్రజానీకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వారం క్రమం తప్పకుండా ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తుందని టిడిపి నాయకులు వెల్లడించారు. ..ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతివారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు …
Read More »సిద్దార్ధ అకాడమీ సృష్టే…విజయవాడ అభివృద్దికి కారణం : ఎంపీ కేశినేని శివనాథ్
-సిద్దార్ధ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు -సీఎం చంద్రబాబు కు స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిద్దార్ధ అకాడమీ విజయవాడ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సిద్దార్ధ అకాడమీ విద్యాసంస్థల స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు విజయవాడలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సిద్దార్ధ అకాడమీ పాలకమండలి, కలెక్టర్ లక్ష్మీశా, ఉమ్మడి కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేల తో కలిసి ఎంపీ …
Read More »మరో పదిహేను రోజుల్లో నిర్మాణం పూర్తి అయిన వాటర్ ట్యాంకుల ప్రారంభోత్సవం
-కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు.. -55 ట్యాంకుల ద్వారా 38 గ్రామాల్లోని 12148 నివాస గృహాలకు ఇంటింటికి శుద్ధ జలాల సరఫరా.. -త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు.. -ఎ.కొండూరు మండలంలో ఆర్.డబ్ల్యూ.ఎస్ వాటర్ ట్యాంక్ ల పరిశీలన లో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి.. -ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులతో కలిసి పర్యటించిన ఎంపీ.. తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలం కోడూరు, …
Read More »కిడ్నీ వ్యాధి రహిత తిరువూరు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ – ఎంపీ కేశినేని శివనాథ్
-కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేసిన ఎంపీ.. -కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మిషా, ఆర్డిఓ మాధురి.. తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిని శాశ్వతంగా నివారించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, జనవరి మాసాంతం నాటికి కృష్ణా జలాలను అందుబాటులోకి తీసుకురానున్నామని, వ్యాధిగ్రస్తులను గుర్తించి నెఫ్రాలజిస్టు సేవల ద్వారా మెరుగైన వైద్య సేవలందించడంతో పాటు పౌష్టికాహారపు కిట్లను పంపిణి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) …
Read More »ప్రజారాజధాని అమరావతి- హైకోర్టు నిర్మాణ పనులలో భాగంగా 48 గంటలపాటు నిర్విరామంగా కాంక్రీట్ పౌరింగ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి- అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC)లో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు భవన సముదాయాల పనులలో భాగంగా చేపట్టిన బ్లాక్-3 కాంక్రీట్ పౌరింగ్ నిర్విరామంగా జరుగుతున్నాయి. 48 గంటలపాటు నిర్విరామంగా జరిగే కాంక్రీట్ పౌరింగ్ పనులను సైట్‌లో APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.గోపాల కృష్ణారెడ్డి శనివారం పూజలు చేసి ప్రారంభించారు. కాంక్రీట్ పౌరింగ్ పనుల సన్నాహాలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC)లోని సూపర్ …
Read More »రైతుల నుంచి అర్జీలు స్వీకరించిన కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్‌లో “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ప్లాట్ల వీధిపోట్లు, గ్రామకంఠాలు, LPS లే అవుట్లు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్‌మెంట్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను “గ్రీవెన్స్ డే”లో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐ.ఏ.ఎస్. లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కమిషనర్ అర్జీదారులకు హామీ …
Read More »బహుళ అంతస్తు భవనాలు నిర్దేశిత నిబందనల మేరకే నిర్మాణాలు చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు నిర్దేశిత నిబందనల మేరకే నిర్మాణాలు చేపట్టాలని, లేకుంటే మార్టిగేజ్ మంజూరు చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ విజయపురి కాలనీ, అశోక్ నగర్, శ్యామల నగర్, అరండల్ పేట తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, అరండల్ పేటలో అనుమతి లేకుండా చేస్తున్న నిర్మాణంను గమనించి, పట్టణ ప్రణాళిక …
Read More »ఈ నెల 11వ తేదీ నుండి సంక్రాంతి సంబరాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలకు ఆహ్లాదకరంగా, ఆనందకర వాతావరణంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. జిఎంసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలపై నగర మేయర్, కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ లతో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ …
Read More »
Prajavartha Online Telugu News