Breaking News

బహుళ అంతస్తు భవనాలు నిర్దేశిత నిబందనల మేరకే నిర్మాణాలు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు నిర్దేశిత నిబందనల మేరకే నిర్మాణాలు చేపట్టాలని, లేకుంటే మార్టిగేజ్ మంజూరు చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ విజయపురి కాలనీ, అశోక్ నగర్, శ్యామల నగర్, అరండల్ పేట తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, అరండల్ పేటలో అనుమతి లేకుండా చేస్తున్న నిర్మాణంను గమనించి, పట్టణ ప్రణాళిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, దానిని తొలగించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. భవనాలు నిర్మాణ దశలోనే వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ, నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని స్పష్టం చేశారు. భవనం నుండి మేజర్ డ్రైన్ వరకు డ్రైనేజి కనెక్షన్ వారే ఇచ్చుకోవాలన్నారు. ప్రదానంగా సెట్ బ్యాక్ పోర్షన్ లో ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదని, జనరేటర్లు కూడా పెట్టడానికి వీలు లేదన్నారు. గ్రీనరీకి ప్లాన్ లో చూపిన విధంగా ఉండాలన్నారు. వాచ్ మెన్ రూమ్ నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. అపార్ట్మెంట్ నిర్వాహకులే డ్రైనేజి లైన్ ను మేజర్ డ్రైన్ వరకు కనెక్ట్ చేసుకోవాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి చేయాలని ప్రజారోగ్య అధికారులను ప్రదాన రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
పర్యటనలో ఈఈ వేణుగోపాల్, డిఈఈ సతీష్, ఎస్ఎస్ ప్రసాద్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *