-ప్రజాదర్భార్ లో వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం
-పశ్చిమ నియోజకవర్గ టిడిపి నాయకులు వెల్లడి
-అర్జీలతో భారీగా తరలివచ్చిన ప్రజానీకం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వారం క్రమం తప్పకుండా ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తుందని టిడిపి నాయకులు వెల్లడించారు. ..ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతివారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ గణపతి రావు రోడ్డులో గల ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంప్ కార్యాలయంలో శనివారం ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి టిడిపి నాయకులు ప్రజాదర్భార్ నిర్వహించారు ప్రజాదర్భార్ కి అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలతో తరలిరావటం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి నుంచి ఆర్జీలు స్వీకరించారు.
ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు అందించారు. అధికారులు కొన్ని అర్జీలను అక్కడిక్కడే పరిష్కరించారు.ఈ ప్రజా దర్బార్ లో రేషన్ కార్డ్ మ్యాపింగ్, కొత్త రేషన్ కార్డ్, టిడ్కో ఇళ్లు, ఇంటి స్థలాలు, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలు, సీనియర్ సిటిజన్ సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఆర్జీలు పెట్టుకున్నారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి సమస్యను ఆన్‌లైన్ చేసి ఫిర్యాదు చేసిన వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ను కూడా పంపుతున్నామని, ప్రజాదర్భార్‌లో తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతురావు, జిల్లా అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణరావు, కార్పొరేటర్ ఉమ్మడి చంటి. క్లస్టర్ ఇన్చార్లు ధనేకుల సుబ్బారావు, భవానీ ప్రసాద్, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా , ,నగరాల కార్పొరేషన్ డైరెక్టర్లు సుఖాసి కిరణ్, బేవర సాయి సుధాకర్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ , పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సుభాషిణి, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు షేక్ నసీమా, మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు అన్సార్, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి పితానీ పద్మ, ఐటిడిపి ప్రధాన కార్యదర్శి బి.రమేష్ , బిసి సెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తమ్మిన శేఖర్, డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారావు, బడుగు వెంకన్న, జాహీద్, హజీజ్, విజయలక్ష్మీ, కొండ, పేరం సత్యనారాయణ, ఈగల సాంబ, సినయర్ సత్తారు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మైనపల్లి రాజు లతో పాటు ప్రభుత్వ శాఖల నుంచి సివిల్ సప్లయ్స్ ఎ.ఎస్.వో, టిడ్కో జె.వో, సచివాలయ సిబ్బంది, పోలీస్ విభాగ సిబ్బంది, హెల్త్, ఎలక్ట్రిక్, కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News