-మిరప రైతులకు భరోసా….ఇ-క్రాప్ 100% అమలుకు చర్యలు -రసీదులు, మౌలిక వసతులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి -మిర్చి సీజన్‌పై ముందస్తు సమీక్ష సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి/గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిర్చి ధరల విషయంలో గతేడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్ష సమావేశం నిర్వహించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో మిర్చి ధరలపై నిర్వహించిన …
Read More »Monthly Archives: January 2026
ప్రమాద బీమా పథకం క్రింద రూ.1.00 కోటి చెక్కును అందజేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత ప్యాకేజీపై ఎస్‌బీఐతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఫలితం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయం ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరుగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి ఎన్. కుసుమ కరుణ కుమారి 2025 మే 3న రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందిన నేపథ్యంలో ఉద్యోగి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం క్రింద రూ.1 కోటి బీమా సొమ్ము చెక్కును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అందజేశారు. బుధవారం …
Read More »77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయండి:సిఎస్ విజయానంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈనెల 26వ తేదీన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపధ్యంలో అందుకు సంబందించి పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహక ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈనెల 26వతేదీ ఉదయం రాజధాని ప్రాంతంలో తొలిసారిగా బహిరంగ ప్రదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నందన ఆకార్యక్రమం …
Read More »రాజానగరంలో త్వరలో జూపార్కు ఏర్పాటుకు ప్రతిపాదన – క్షేత్ర స్థాయిలో పరిశీలన
-ప్రకృతి పర్యాటకానికి అనుకూలమని వెల్లడించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజానగరం / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూపార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. బుధవారం రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల …
Read More »మత్స్యకారుల కోసం అంకితభావంతో పనిచేయాలి…
-ఆఫ్కాఫ్ (APCOF) నూతన చైర్మన్, వైస్ చైర్మన్ లను అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌కు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి మత్స్యకారుడికి చేరేలా కృషి చేయాలని …
Read More »రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చటటమే లక్ష్యం
-నెడ్ క్యాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీ. కమలాకర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ రంగంలో దేశానికి మార్గదర్శకంగా నిలిపే లక్ష్యంతో పని చేస్తున్నామని నెడ్ క్యాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీ. కమలాకర్ బాబు తెలిపారు. స్థానిక లెమన్ ట్రీ హోటల్ లో వివిధ రంగాల్లో గ్రీన్ ఎనర్జీ కోసం కృషి చేసిన 22 మందికి ప్రకాష్‌మయ్ (PRAKASH may Enertia Awards 2026) ఎనర్షియా అవార్డ్స్ 2026 ను …
Read More »నేటి (జనవరి 8) నుండి ‘ఆవకాయ్ -అమరావతి సినిమా, కళా, సంస్కృతి, సాహిత్యోత్సవం
– రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో 3 రోజుల పాటు ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు – తెలుగు సినిమా, సాంస్కృతిక, కళా, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా విజయవాడలోని పున్నమి ఘాట్, భవాని ద్వీపంలో సర్వాంగ సుందరంగా వేడుకలు – కనువిందు చేయనున్న సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, సంగీతం, నృత్యం, నాటకాలు, వర్క్ షాప్ లు, సాంస్కృతిక భాషణలు, ఆధునిక కళా ప్రదర్శనలు – సందర్శకులకు ప్రవేశం ఉచితం..ప్రేక్షకులు ఆన్ లైన్ వేదికగా …
Read More »విద్యార్ధులు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి…
-డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆకాంక్ష -ఎంపీ కేశినేని శివనాథ్ సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ -నందిగామ నియోజకవర్గంలోని 25 ప్రభుత్వ పాఠశాలలకు అందజేత -కెవిఆర్ కాలేజీలో జరిగిన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం -స్పోర్ట్స్ కిట్స్ లో 8 క్రీడలకు సంబంధించిన క్రీడావస్తువులు -ఎంపీ కేశినేని శివనాథ్ కు ధన్యవాదాలు తెలిపిన విద్యార్ధులు నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే..ఎన్టీఆర్ జిల్లా …
Read More »మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నాగేంద్ర నాయక్ చౌహాన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని బుధవారం వైసీపీ ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీ నాగేంద్ర నాయక్ చౌహాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనమీద నమ్మకంతో వైసీపీ ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీగా తనకు భాద్యతను అప్పగించినందుకు పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపినట్లు నాగేంద్ర నాయక్ చౌహాన్ చెప్పారు.
Read More »స్టెల్లా కళాశాలలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వారోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో యన్ సి సి 8 ఆంధ్రా నేవీ యూనిట్ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వారోత్సవాలు కమాండింగ్ ఆఫీసర్ సుజీత్ కుమార్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ ప్రారంభించారు. 2022లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లో భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి అని ప్రజలంతా ముఖ్యం గా యువత పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేయాలని మరియు ఈ గ్రీన్ …
Read More »
Prajavartha Online Telugu News