మత్స్యకారుల కోసం అంకితభావంతో పనిచేయాలి…

-ఆఫ్కాఫ్ (APCOF) నూత‌న చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ల‌ను అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌కు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి మత్స్యకారుడికి చేరేలా కృషి చేయాలని కమిటీ సభ్యులకు మంత్రి సూచించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సహకార సంఘాల ద్వారా పరిష్కార మార్గాలు చూపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, సంక్షేమ కార్యక్రమాల అమలుకు పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. నూతన కమిటీ సమన్వయంతో, అంకితభావంతో పనిచేస్తే మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆఫ్కాఫ్ చైర్మ‌న్ యాట‌గిరి రాంప్ర‌సాద్, వైస్ చైర్మ‌న్ రంగారావు, జిల్లా అధ్య‌క్షులు పోలిశెట్టి నాగ‌రాజు, శ్రీనివాస్, పాపారావు, న‌గేష్, గురునాథం, పేర‌య్య , జీవీ ర‌త్నం మ‌రియు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *