-డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆకాంక్ష
-ఎంపీ కేశినేని శివనాథ్ సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ
-నందిగామ నియోజకవర్గంలోని 25 ప్రభుత్వ పాఠశాలలకు అందజేత
-కెవిఆర్ కాలేజీలో జరిగిన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం
-స్పోర్ట్స్ కిట్స్ లో 8 క్రీడలకు సంబంధించిన క్రీడావస్తువులు
-ఎంపీ కేశినేని శివనాథ్ కు ధన్యవాదాలు తెలిపిన విద్యార్ధులు
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే..ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 145 ప్రభుత్వ పాఠశాలలకు ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో క్రీడా వికాసం పేరుతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణి చేయటం హర్షణీయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని విద్యార్ధులు చదువులతో పాటు ఆటల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.
నందిగామ పట్టణంలోని కెవిఆర్ కాలేజీ లో నియోజకవర్గంలోని 25 ప్రభుత్వ పాఠశాలకు బుధవారం క్రీడా వికాసం పేరుతో పలు క్రీడలకు సంబంధించిన ఆట వస్తువులతో కూడిన కిట్స్ పంపిణీ కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డిప్యూటీ స్పీకర్ ఆర్.ఆర్.ఆర్., ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ ఛైర్ పర్సన్ తేజస్వి పొడపాటి, డిఈవో చంద్రకళ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 25 పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ ను డిప్యూటీ స్పీకర్ ఆర్.ఆర్.ఆర్, తోపాటు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు.
ఈ సందర్బంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యాశాఖ లో వినూతన్న మార్పులకు శ్రీకారం చుట్టారని,. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు క్రీడల్లో రాణించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా తన సొంత నిధులతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల మైదనాలు బాగు చేయించటం, విద్యార్దులకు కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయటం ఎంతో గొప్ప విషయమన్నారు. విద్యార్ధులు ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు.
ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలలకు తన సొంత నిధులతో 8 క్రీడలకు సంబంధించిన క్రీడావస్తువులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయటానికి స్పూర్తి ముఖ్య మంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రౌండ్స్ అధ్వాన్నంగా తయారై విద్యార్ధులు ఆటలకు దూరంగా వున్నారన్నారు . ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విధ్యార్ధులు చదువుల్లోనే కాదు..ఆటల్లో కూడా బాగా రాణించాలని ఆకాంక్షించారు.అందుకే తన సొంత నిధులతో జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రౌండ్స్ అభివృద్ది చేయించి లాంగ్ జంప్ పిట్స్ సిద్దం చేయంచినట్లు తెలిపారు. అలాగే విద్యార్ధులకు అవసరమైన క్రీడా వస్తువులను కూడా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
తనకి ఇష్టమైన నాయకుల్లో మంత్రి నారా లోకేష్ ఒక్కరని… ఆయన విద్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. మెగా పెరెంట్ టీచర్ మీటింగ్ ఒక పండుగ గా నిర్వహించాడని గుర్తు చేశారు. ఇక కాలేజీ విద్యార్ధులు ఇబ్బంది పడకుండా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాడన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలనేదే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించారు.
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు ఎంపి కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో అందించిన ఈ స్పోర్ట్స్ కిట్స్ లో వాలీబాల్ నెట్స్, వాలీబాల్స్, త్రో బాల్ నెట్స్, త్రో బాల్స్, టెన్నికాయిట్ నెట్స్, టెన్నికాయిట్స్, హ్యాండ్ బాల్స్, షటిల్ నెట్స్, స్కిప్పింగ్ రోప్స్, చెస్ బోర్డ్ అండ్ కాయిన్స్, ఖో-ఖొ పోల్స్, బాల్ బ్యాడ్మింటన్ కిట్, హై జంప్ స్టాండ్స్, టేక్ ఆఫ్ బోర్డ్ వున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన వసతులు, మౌళిక సదుపాయాల అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణ కుమారి, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, నందిగామ పట్టణ పార్టీ ప్రెసిడెంట్ ఏచూరి రాము, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జా అజేయ్, ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చిరుమామిళ్ల కృష్ణ, నందిగామ రూరల్ పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి,, చందర్లపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ మేకల సుధాకర్, లతో పాటు ప్రభుత్వ అధికారులు, ఎన్డీయే కూటమి నేతలు, పిజికల్ ఏడ్యుకేషన్ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News