Breaking News

నేటి (జనవరి 8) నుండి ‘ఆవకాయ్ -అమరావతి సినిమా, కళా, సంస్కృతి, సాహిత్యోత్సవం

– రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో 3 రోజుల పాటు ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు
– తెలుగు సినిమా, సాంస్కృతిక, కళా, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా విజయవాడలోని పున్నమి ఘాట్, భవాని ద్వీపంలో సర్వాంగ సుందరంగా వేడుకలు
– కనువిందు చేయనున్న సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, సంగీతం, నృత్యం, నాటకాలు, వర్క్ షాప్ లు, సాంస్కృతిక భాషణలు, ఆధునిక కళా ప్రదర్శనలు
– సందర్శకులకు ప్రవేశం ఉచితం..ప్రేక్షకులు ఆన్ లైన్ వేదికగా www.avakaifestival.com లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించిన నిర్వాహకులు
– మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్ల ప్రక్రియ దిగ్విజయంగా పూర్తి చేసిన పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట, అధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం అద్భుతమైన కళా సంబరానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ముస్తాబైంది. సాహిత్యం, కళాకారులు, సాంస్కృతిక సంప్రదాయాలకు నిలయంగా విరాజిల్లుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘనమైన వారసత్వాన్ని, భాషా ప్రాభవాన్ని, కళా వైభవాన్ని జరుపుకోవడానికి ‘ఆవకాయ్ – అమరావతి సినిమా, సంస్కృతి, సాహిత్యోత్సవం’ సిద్ధమైంది.సీఎం నారా చంద్రబాబు నాయుడు చొరవతో, మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో రాష్ట్ర పర్యాటక శాఖ, ‘టీమ్‌వర్క్ ఆర్ట్స్’ సంయుక్తంగా తెలుగు సినిమా, సాంస్కృతిక, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా విజయవాడ వేదికగా కృష్ణా నది తీరాన ఉన్న పున్నమి ఘాట్ మరియు భవానీ ఐలాండ్ లో నేటి (జనవరి 8) నుండి ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు 3 రోజుల పాటు(జనవరి 10 వరకు) ప్రజలను కనువిందు చేయనున్నాయి. సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, సంగీతం, నృత్యం, నాటకాలు, వర్క్ షాప్ లు, సాంస్కృతిక భాషణలు, ఆధునిక కళా ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగనుంది. సందర్శకులకు ప్రవేశం ఉచితం..మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట, అధికారులు ఏర్పాట్లను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, ఎండి ఆమ్రపాలి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, టీం వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధి సయ్యద్ శ్యామ్స్ జావిద్ తదితరులు పున్నమి ఘాట్, భవాని ఐలాండ్ లలో పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా హౌస్ బోట్లు, రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రయల్ రన్ గా ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నదీ తీరాల్లో ఈ తరహా హౌస్ బోట్స్ ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్షమన్నారు. సాంకేతికతతో కూడిన ఆర్థిక వృద్ధిని సాధిస్తూనే, రాష్ట్ర సంస్కృతిని కాపాడుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దూరదృష్టికి ఈ ఉత్సవం ఒక నిదర్శనమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్ లో సినిమా, సాహిత్య రంగాలకు చెందిన దిగ్గజాలు, ప్రపంచవ్యాప్త కళాకారులు పాల్గొననున్నారు. ప్రధానంగా హెరిటేజ్ వాక్ తో పాటు ఘాట్ ఫెర్రీ ప్రయాణం, ఫుడ్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రముఖ గాయకులు జావేద్ అలీతో సంగీత కచేరి ఉండనుంది. వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, సినిమా చర్చలు మరియు సాహిత్య గోష్టులు సందర్శకులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన పురోగతిని, సాంస్కృతిక మూలాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేదికను రూపొందించడం విశేషం. మూడు రోజుల పాటు జరిగే ఆవకాయ్ అమరావతి ఉత్సవానికి సందర్శకులు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పకడ్భందీ ఏర్పాట్లు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. నిర్వాహకులు సందర్శకులకు ప్రవేశం ఉచితంగా కల్పించారు. ఈ సందర్భంగా ఉత్సవాన్ని విజయవంతం చేయాలని పర్యాటక శాఖ పిలుపునిచ్చింది.

నేడు (జనవరి 8) సాయంత్రం 4.45 గం.లకు భారీ తోలుబొమ్మలాట, డ్రమ్స్ ప్రదర్శనతో ప్రారంభోత్సవం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అనంతరం జమ్మెర్స్ వారిచే సంగీత ప్రదర్శన, పున్నమి ఘాట్ దగ్గర హారతి కార్యక్రమం ఉంటుంది. ఒమాజియో పెర్ఫార్మింగ్ కంపెనీ వారి హర్ ఫ్రేమ్స్, హర్ ఫైర్ కార్యక్రమం ఉండనుంది. అనంతరం 7.50 గం.లకు ముఖ్య అతిథులతో ఉత్సవం ప్రారంభం అవుతుంది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, యూరోపియన్ యూనియన్ రాయబారి హెచ్.ఇ.హెర్వే డెల్ఫిన్, టీమ్ వర్క్ ఆర్ట్స్ పాలనాధికారి సంజయ్ కె. రాయ్ పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి 8.30 నుండి 10 గం.ల వరకు ప్రేమ కథ సంగీత నాటకంతో తొలిరోజు కార్యక్రమం ముగస్తుంది.

రెండవ రోజు(జనవరి 9) ఉదయం 11 గం.ల నుండి భవానీ ఐల్యాండ్ లో, సాయంత్రం 5 గం.ల నుండి పున్నమిఘాట్ లలో వేడుకలు జరుగనున్నాయి. భవానీ ద్వీపంలో సినిమాల్లో ప్రతినాయకుల పాత్రపై జరిగే చర్చలో ఎస్.హుస్సేన్ జైదీ, యండమూరి వీరేంద్రనాథ్, సుధీర్ మిశ్రాలు పాల్గొంటారు. అదే విధంగా తుహోన్ ఆదిత్యరాయ్ తో మార్షల్ ఆర్ట్స్ పై శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గం.లకు భారతీయ పురాణాలు, కథ చెప్పే విధానంలో పరిణామక్రమం అంశంపై బ్నిం, కస్తూరి మురళీకృష్ణ,సంజీవ్ పస్రిచా, మొతాలీ అనురాధలు సంభాషిస్తారు. ప్రముఖ నగాడా వాయిద్యకారులు నాథులాల్ సోలంకితో నగడా శిక్షణా శిబిరం నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం స్టోరీ అవర్ యూకే వారిచే సంగీత, మాటలతో సార్వత్రిక కథలపై కథా కాలపేక్షం నిర్వహించనున్నారు. ప్రముఖ తోలుబొమ్మలాట కళాకారుడు షమీమ్ తో తోలుబొమ్మల తయారీలో శిక్షణ ఉంటుంది. ఓటీటీ యుగంలో సినిమా అంశంపై లీనా యాదవ్, శిబిశిష్ సర్కార్, సౌగుట ముఖర్జీ, సుప్రియ యార్లగడ్డ, సునీల్ చైనాని, శ్రీరూపా మిత్ర చర్చిస్తారు. ప్రఖ్యాత ఫ్రెంచ్ నృత్య కళాకారులు గిల్లెస్ చుయెన్ తో డాన్స్ శిక్షణా శిబిరం నిర్వహిస్తారు. నవల నుండి సినిమా వరకు వల్లి పద్మాంజలితో యండమూరి వీరేంద్రనాథ్, ఎ.కోదండరామిరెడ్డి సంభాషిస్తారు. అనంతరం సాయంత్రం గం.ల నుండి పున్నమిఘాట్ లో చందన బాల కళ్యాణ్ గారెచే కర్ణాటక, అధ్యాత్మిక సంగీత విభావరి జరుగనుంది. ఆ తర్వాత వనశ్రీ రచించిన ‘రస’ ఐక్యం కూచిపూడి నృత్యం నాటకీయ కథ ప్రదర్శించబడుతుంది. శ్యామ్ రక్షంద జలీల్ తో ప్రియ సారయ్యా, శేఖర్ రావ్జ్యాని, కాసర్ల సంభాషణ, ప్రియ సరైయ లతో సినిమాల్లో సంగీతం, కవిత్వం అంశంపై చర్చ జరగనుంది. అనుభూతినిచ్చే ముషైరా పై అజర్ ఇక్బాల్, ఇక్బాల్ అష్హర్, ఖుష్బీర్ సింగ్ షాద్, డా. నుస్రత్ మెహదీ, పాయల మురళీకృష్ణ, పాపులర్ మెరతి, సైఫ్ నిజామి, సర్దార్ ఖలీమ్ లు చర్చించనున్నారు. అనంతరం ఆజ్ రంగ్ హై కె.శ్రీనివాసరావు, ఆచార్య జయప్రద, ఆచార్య తడకమళ్ల విజయ్ కుమార్ లచే సంగీత విభావరి ఉండనుంది.

మూడవ రోజు(జనవరి 10) కథా కాలక్షేపం తో పాటు నీటిపై రాతలు అంశంపై తెలుగులో కథ చెప్పే కళశ్రీ కరుణతో బ్నిం, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డితో చర్చా కార్యక్రమం ఉంటుంది.సినిమా మరియు పాత్రికేయ వృత్తి అంశంపై చల్లా భాగ్యలక్ష్మీతో వర ముళ్లపూడి, వడ్డి ఓం ప్రకాష్ నారాయణల మధ్య సంభాషణ ఉంటుంది. తెలుగు సాహిత్యం, సినిమా వైభవంపై మోతాలీ అనురాధతో కస్తూరి మురళీకృష్ణ, మామిడి హరికృష్ణ, శ్రీపతి వర్మ వేదాంతం ల మధ్య సంభాషణ ఉంటుంది. అనంతరం పదాలకు సరిహద్దులు లేవు అనే అంశంపై చర్చ ఉంటుంది. సాయంత్రం పున్నమి ఘాట్ లో చౌరస్తా వారిచే సంగీత ప్రదర్శన,టి.డి జనార్థన్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, బుర్రా సాయిమాధవ్, తేజస్వి పొడపాటి చేతుల మీదుగా నట సార్వభౌమ ఎన్టీఆర్ నట విశ్వరూపానికి నివాళులు అర్పించే కార్యక్రమం జరుగనుంది. ఆ తర్వాత ప్రేమ కథా సంగీత నాటకం ప్రదర్శన అనంతరం 9 గం.లకు ఉత్సవం ముగుస్తుంది.పున్నమి ఘాట్ లో రాత్రి 11 గం.లకు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *