Daily Archives: February 15, 2026

రేపు ఏపీకి బిల్ గేట్స్ రాక

-సంజీవని సహా సాంకేతిక సాగు ప్రాజెక్టుల పరిశీలన -రియల్ టైమ్ గవర్నెన్సు, వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ కు చెందిన 6గురు ప్రతినిధుల బృందం అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి రానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో కలిసి బిల్ గేట్స్ …

Read More »

జనసేన సభ్యత్వ నమోదుకు శ్రీకారం

-తొలి సభ్యత్వం తీసుకున్న పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  -కార్యకర్తల బీమా కోసం రూ.2 కోట్లు విరాళం -రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ -పిఠాపురం నియోజకవర్గంలో వారం ముందే మొదలు -ఇక నుంచి పార్టీకి సేవ చేసే వారిని ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా గుర్తింపు -మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జనసేన పార్టీ …

Read More »

గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,876.23 కోట్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,876.23 కోట్లు కేటాయించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 143 కోట్లు అధికంగా కేటాయించడం, స్వయం సహాయక సంఘాల మహిళల సాధికారత, గ్రామీణ జీవనోపాధుల పురోగతిపట్ల రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది, సెర్ప్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు, …

Read More »

ఆసక్తి కలిగిన సభ్యులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికకు ఆదివారం 17 నామినేషన్లు దాఖలు అయ్యాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ మరియు ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మరియు ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికకు ఆదివారం …

Read More »

జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీ నియామకం

-మాజీ మంత్రి కేడీసీసీ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం హర్షం జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీని మొత్తం 17 మంది సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు నియమించడం జరిగింది జరిగింది అని రఘురాం తెలియజేశారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా షేక్ అక్బర్, జనరల్ సెక్రటరీగా గాలిబ్ సైదా షేక్, వైస్ ప్రెసిడెంట్లుగా మిరాహుస్సేన్ షేక్, సోనుమియా షేకూ, ఆడమ్ షేక్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు నియమించబడ్డారు. ఈ నియామకాల …

Read More »

కన్నులపండువగా మహా శివరాత్రి వేడుకలు

-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు యనమలకుదురు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా లో ప్రసిద్ధిగాంచిన యనమలకుదురు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారిని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రభలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ …

Read More »

“మా ఆర్ట్స్ చంటి, బాబీ” ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి శివ కళ్యాణోత్సవం కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద ఆదివారం “మా ఆర్ట్స్ చంటి, బాబీ” ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి శివ కళ్యాణోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు.. ఈ మహోత్సవంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ …

Read More »

శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు

గుంటూరు/పెదకాకాని, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పవిత్ర సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకానిలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు స్వామివారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందచేసి, స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందచేశారు. భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శివనామస్మరణతో వాతావరణం ఆధ్యాత్మికతతో పరవశించింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ …

Read More »

సి.యం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉండవల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సోమవారం ఉన్న దృష్ట్యా, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండవల్లి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read More »

జీరో పావర్టీ (P4) కార్యక్రమంలో పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి పట్టణానికి చెందిన డా. వడ్లమూడి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య & వడ్లమూడి వెంకట లక్ష్మమ్మ ఫౌండేషన్, తెనాలి తరఫున జీరో పావర్టీ (P4) కార్యక్రమం కింద పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. ఈ ఉదార విరాళం తెనాలి శాసనసభ నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధికి ఉపయోగపడనుంది. జీరో పావర్టీ (P4) కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా విద్యా రంగాన్ని బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం ఈ …

Read More »