Breaking News

ఆసక్తి కలిగిన సభ్యులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికకు ఆదివారం 17 నామినేషన్లు దాఖలు అయ్యాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ మరియు ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మరియు ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికకు ఆదివారం సెక్రటరీకి 4, వైస్ ప్రెసిడెంట్ 1, ట్రెజరర్ కి 2, జాయింట్ సెక్రెటరీ కి 4, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కు 6 (పురుషులు 5, మహిళలు1) నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. నామినేషన్లకు 16వ తేదీ (సోమవారం) చివరి రోజు అని, ఎన్నికలలో పాల్గొనుటకు ఆసక్తి కలిగిన సభ్యులు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *