Breaking News

జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీ నియామకం

-మాజీ మంత్రి కేడీసీసీ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం హర్షం

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీని మొత్తం 17 మంది సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు నియమించడం జరిగింది జరిగింది అని రఘురాం తెలియజేశారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా షేక్ అక్బర్, జనరల్ సెక్రటరీగా గాలిబ్ సైదా షేక్, వైస్ ప్రెసిడెంట్లుగా మిరాహుస్సేన్ షేక్, సోనుమియా షేకూ, ఆడమ్ షేక్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు నియమించబడ్డారు. ఈ నియామకాల పట్ల మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం హర్షం వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గాల సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా హజ్ యాత్రకు ఒక్కో యాత్రికుడికి రూ.1 లక్ష రుణ సదుపాయం కల్పించడం పట్ల ముస్లిం సోదరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మైనారిటీల ఆధ్యాత్మిక భావాలను గౌరవించే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మైనారిటీల అభివృద్ధి కార్యక్రమాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు విదేశీ విద్య, విదేశీ ఉద్యోగ అవకాశాలకు ప్రోత్సాహం అందించాలని తమ ద్వారా ముఖ్యమంత్రి కి తెలియజేయాలని ముస్లిం సోదరులు కోరగా సానుకూలంగా స్పందించిన నెట్టెం రఘురాం తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. మైనారిటీల సామాజిక, ఆర్థిక పురోగతికి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కమిటీ విజయవంతంగా పనిచేసి జగ్గయ్యపేట నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *