-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు
యనమలకుదురు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా లో ప్రసిద్ధిగాంచిన యనమలకుదురు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారిని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రభలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివరాత్రి పండుగ వేళ భోళాశంకరుడు అశీస్సులు తెలుగు ప్రజలందరి పై ఉండి సుఖసంతోషాలు జీవించాలన్నారు. ముక్కంటి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని యార్లగడ్డ ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News