-డిసెంబర్ 5 గురువారం ఎన్నికల నేపథ్యంలో ప్రథాన ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ
-డీ ఆర్వో/ సహాయ రిటర్నింగ్ అధికారి టి. సీతారామ మూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి 05.12.2024 (గురువారం)న జరగాల్సిన ఉపఎన్నికలు నేపధ్యంలో పోలింగ్ రోజున అంటే 05.12.2024న (గురువారం) ఓటర్లకు ప్రత్యేక క్యాజువల్ సెలవుల మంజూరు చెయ్యాలని జిల్లా రెవిన్యూ అధికారి / సహాయ రిటర్నింగ్ అధికారి టి. సీతారామ మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, అల్లూరి సీతా రామరాజు జిల్లాల్లోని తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఉప ఎన్నికకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఆ షెడ్యూల్ ప్రకారం, 05.12.2024 (గురువారం) ఉదయం 8.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఓటు హక్కు కలిగి ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్‌మెంట్‌లు / అథారిటీలు, పైన పేర్కొన్న ఉపాధ్యాయుల నియోజక వర్గంలో నమోదైన తమ ఉద్యోగులు/కార్మికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. . ఆఫీసు / డ్యూటీకి ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతి వంటివి; షిఫ్ట్ల సర్దుబాట్లు చేసుకోవాలన్నారు. డ్యూటీ గంటలు తక్కువగా ఉండటం లేదా పోల్ రోజున అంటే 05.12.2024 (గురువారం) ఉదయం 8.00 నుండి సాయంత్రం 4.00 గంటల మధ్య వారి ఫ్రాంచైజీ హక్కును వినియోగించుకోవడానికి వీలుగా సర్దుబాటు చెయ్యాలన్నారు.