-అర్జీలు పరిష్కార తీరులో మార్పు స్పష్టంగా ఉండాలి
-మంగళవారం సాయంత్రం కలక్టరేట్ లో రెవిన్యూ అధికారుల సమావేశంలో డివిజన్ వారీగా పనితీరు పై జెసి చిన్న రాముడు, డి ఆర్వో టి. సీతా రామమూర్తి తో కూడి కలెక్టరు సమీక్ష నిర్వహించారు.
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రెవిన్యూ అధికారి అర్జీలు పరిష్కారం విధానంలోనే కాదు కోర్టు సంబంధ, విచారణ చేపట్టే సందర్భాల్లో నిర్ధారణ చేసుకుని అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. కోర్టులో విచారణ ఉన్న సందర్భాల్లో ఆర్ వో ఆర్ జారీ చేయరాదని స్పష్టం చేశారు. సివిల్ తగాదా ఉన్న వ్యక్తులు రెవిన్యూ అధికారి వద్ద అర్జీ ఇవ్వడం లో ప్రధాన ఉద్దేశ్యం మనం నిజ నిర్ధారణ నివేదికలు వస్తాయని భావిస్తుడడం అని పేర్కొన్నారు. ఏదైనా ధ్రువపత్రము కోసం అభ్యర్థన వొచ్చే సమావేశంలో ఒక తహసిల్దార్ తిరస్కారం చేస్తే, తదుపరి ఆమోదం ఇచ్చే సమయంలో తగిన రికార్డులు ఆధారంగా చేసుకుని వాటిని పేర్కొంటూ జారీ చేయడం ముఖ్యం అన్నారు. పరిశీలన చెయ్యకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ జారీ చేయరాదని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార విధానంలో రీ అడ్రస్ చేసిన వాటి విషయంలో పారదర్శకంగా ఉండే విధంగా జిల్లా స్థాయిలో ముగ్గురు అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశీలన చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి వొచ్చిన అర్జీలు పరిష్కార కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఏదైనా ఒక కోర్టు ఆదేశాలను కలెక్టరు, జెసి, ఆర్డీవో ద్వారా వొస్తే వాటికీ సంబంధించి సమాధానం సంబంధింత అధికారి రిమార్కులు తో కూడి ఉండాలన్నారు. ఏదైనా ఒక ఫిర్యాదు తిరిగి తిరిగి వొస్తే అందుకు వాస్తవికతను కలిగి ఉండే పరిష్కారం చూపాలన్నారు. వొచ్చే సమావేశంలో కేసు స్టడీ కింద పరిష్కార అర్జీ లపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.
నీటి సంఘాల ఎన్నికలు ఎంపిక ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కోన్నారు. ఈ ప్రక్రియలో ఓటు హక్కు కలిగి ఉన్న వ్యక్తులే పాల్గొనాలను, ఇందులో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం ఉండరాదన్నారు. ఇరిగేషన్ అధికారులు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇందులో రెవిన్యూ యంత్రాంగం సహకారం సూచనలను ఇవ్వడం ద్వారా సజావుగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
రాజమండ్రి ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత లు వివరాలు తెలియ చేస్తూ, ఎక్కువగా ఆక్రమణలకు సంబంధించిన అర్జీలు రావడం జరిగిందన్నారు. తదుపరి మండల వారీగా భూ సంబంధ అంశాలపై ఆర్జీలను ఆర్డీవోలు వివరించగా, సంబంధిత తహసిల్దార్ వివరణ ఇవ్వడం జరిగింది.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా లాండ్ సర్వే అధికారి బి లక్ష్మీ నారాయణ, ఏవో ఆలీ, తహసీల్దార్లు , కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.