-అపరాధ రుసుము లేకుంగా పరీక్ష ఫీజు
-డిసెంబర్ 5 వ తేది లోగా చెల్లించవచ్చు.
-ఆర్ ఐ ఓ..ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2025 సంవత్సరం మార్చి నెలలో జరుగు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇంకనూ పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు అందరూ డిసెంబర్ 5వ తేదీ లోగా అపరాధ రుసుము లేకుండా చెల్లించావచ్చునని తూర్పుగోదావరి జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున జనరల్ మరియు లొకేషనల్ కోర్సులు నందు చదువుచున్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంకను ఫీజు చెల్లించని విద్యార్థు లందరు తప్పని సరిగా పరిక్ష సీజు చెల్లించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. కావున అన్ని మేనేజ్మెంట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించి జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజును డిసెంబర్ వ తేది లోగా చెల్లించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం ఆ ప్రకటనలో తెలియజేశారు.