రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం రూరల్ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టరు పి ప్రశాంతి అక్కడ రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి ఇటీవల గ్రామ రెవెన్యూ సదస్సుల సందర్భంగా వొచ్చిన ఆర్జీల పరిష్కార స్థాయి ను అడిగి తెలుసుకున్నారు. ఆర్ వో ఆర్ నిమిత్తం వొచ్చిన అర్జీలను నూరుశాతం డేటా ఎంట్రీ చేసినట్లు తహసిల్దార్ వివరించారు. రీ ఓపెన్ పీ జి ఆర్ ఎస్ అర్జీలను జవాబుదారీతనం కలిగి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవిన్యూ కు సంబందించని అర్జీలను సంభందిత శాఖలకు పంపాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ స్థాయి కి చెందిన డేటా ఎంట్రీ నమోదు వ్యక్తిగతంగా పర్యవేక్షణా చెయ్యడం తప్పని సరి అని ఆదేశించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పై పూర్తి ఆధారపడకుండా తహసిల్దార్ తనిఖీ చేయాలన్నారు. నీటి తీరువ విధింపు మండల పరిధిలో డెల్టా గ్రామాలు, మెట్ట గ్రామాల వివరాలు, డేటా ఎంట్రీ ప్రక్రియ తదితర అంశాల ప్రగతి వివరాలను, డేటా ఎంట్రీ వివరాల నమోదు కు పట్టే సమయం తదితర వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ తనిఖీ సందర్బంలో రూరల్ తహసిల్దార్ పి వి ఎస్ కుమార్, డిప్యూటి తహశీల్దార్లు, సర్వేయర్ లు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …