రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ధవళేశ్వరం లోని భవిత ఉపకేంద్రము మరియు పలుకు దివ్యాంగుల స్కూల్ నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ “విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం, 2016″, నల్సా వారి “విభిన్న ప్రతిభ వంతులైన పిల్లలకు న్యాయ సేవల పథకం,” మొదలగు అంశాల గురించి వివరించారు. వారికి సమాన అవకాశాలు కల్పించడం, హక్కులను పరిరక్షించడం, వారి సంక్షేమం కోసం అందుబాటులో ఉన్న పథకాలు, న్యాయ సేవల గురించి తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు అనేక రంగాల్లో రాణిస్తున్నారని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిని ప్రోత్సహించి, అండగా నిలబడాలని అన్నారు. వీరి పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, వివక్ష చూపడం నేరమని, ప్రతి ఒక్కరూ వారి విభిన్నత్వాన్ని గౌరవిస్తూ వారి హక్కులకు భంగం కలిగించకుండా నడుచుకోవాలని అన్నారు. సంక్షేమ పథకాలు విషయంలో కానీ, వైద్య చికిత్స అవసరమైనా కానీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని తెలియజేశారు. భవిత ఉపకేంద్రంలోని సదుపాయాలు, పిల్లలకు మానసిక ఎదుగుదలకు తోడ్పడే ఉల్లాసభరితమైన శిక్షణా కార్యకలాపాలు బాగున్నాయని అన్నారు. అనంతరం న్యాయమూర్తి పిల్లలతో కేక్ కట్ చేయించి వారికి తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్.ఈ.ఓ. బి.కె. చందు కుమార్ , సమన్వయ కర్త ఏన్.కనకబాబు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …