Breaking News

తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Padmavati Puram, Tirupati) నందు 05-12- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును.

జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం:Govt ITI, Padmavati Puram, Tirupati,Tirupati Dist.

ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అమరరాజా గ్రూప్, ముత్తూట్ గ్రూప్ ,ఎస్ బి బి మెడికేర్ ,ఇండోఎంఐఎం మొదలగు కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.

విద్యార్హతలు: పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్త అయిన యువతీ యువకులు అర్హులు.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు విద్యార్హత సంబందించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు బయోడేటా ఫామ్ తో పాటు క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా నమోదు చేసుకొని కచ్చితంగా అడ్మిట్ కార్డు తో జాబ్ మేళాకు హాజరవ్వవలెను అని ఆర్ లోకనాథం గారు, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి తిరుపతి జిల్లా మరియు శ్రీలక్ష్మి గారు ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఐటిఐ తిరుపతి వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/

మరిన్ని వివరములకు 8555972657మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *