-సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. మొండితోక జగన్మోహనరావు, సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పధకానికి సంబంధించిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని నందిగామ శాసన సభ్యులు డా.మొండితోక జగన్మోహనరావు, సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కంచికచర్ల ఓసి క్లబ్ లో నిర్వహించిన నందిగామ నియోజకవర్గ స్థాయి సమావేశంలో నియోజకవర్గంలోని 4 మండలాల తహశీల్దార్లు, యంపిడిఓలు, నందిగామ నగరపంచాయతి కమిషనరు, ఇతర సిబ్బందితో గృహనిర్మాణ ప్రగతి పై వారు సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతీ ఇంటికీ రూ. 1.80 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. లబ్దిదారులు తమ ఇళ్లను త్వరితగతింగా పూర్తి చేసుకోవాలని, ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విజయవాడ సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లేఅవుట్ అభివృద్ధి పనులు ఏమైనా మిగిలి ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లేఅవుట్లలో నీటి సరఫరా, ఇతర మౌలిక వసతుల విషయంలో సంబంధిత అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు.