Breaking News

గోవధకు పాల్పడినా, తోడ్పడినా చట్టరీత్యా శిక్షార్హులు…

-జెసి కె. మోహన్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గోవధకు పాల్పడినా అందుకు తోడ్పడినా అటువంటి వారు చట్టరీత్యా శిక్షార్హులని జాయింట్ కలెక్టరు (సంక్షేమం) కె. మోహన్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరు జె.నివాస్ ఆదేశాలు మేరకు బక్రీద్ సందర్భంగా జిల్లా యస్ పిసిఏ సమావేశం జెసి కె.మోహన్ కుమార్ అధ్యక్షతన స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ గోవధ నిషేధ పశుసంరక్షణా చట్టం-1977 ప్రకారం గోవధ నిషేధించడమైనదన్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ నియంత్రణకు మండల, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికారులతో ప్రత్యేక బృందాలు నియమించడం జరిగిందన్నారు. మండల స్థాయిలో యంఆర్ ఓ ఛైర్ పర్సన్ గా స్థానిక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో కూడిన బృందం గోవుల అక్రమ రవాణా, గోవధ నియంత్రణకు అత్యంత అప్రమత్తతతో పనిజేస్తారన్నారు. ఈబృందాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యవేక్షించి ఎక్కడా గోవధకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు జిల్లా కలెక్టరు వారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని మోహన్ కుమార్ తెలిపారు. గోవధకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇప్పటికే నియంత్రణా చర్యలను పోలీస్ అధికారులు చేపట్టడం జరిగిందన్నారు. రవాణాశాఖాధికారులు కూడా గోవుల తరలింపు విషయంలో ఆయా చెక్ పోస్టుల వద్ద అవసరమైన తనిఖీలు నిర్వహించాలన్నారు. అక్రమ గోవుల రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతి కార్యదర్శులను కూడా అప్రమత్తంగా ఉంచాలని డిపిటకు ఆయన సూచించారు. గోవధ నిషేధ, పశుసంరక్షణ చట్టం పై మరియు గోరక్షణ పై విద్యార్ధుల్లో కూడా అవగాహన కలిగించాలని డిఇఓకు సూచించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల వద్ద సంబంధిత అవగాహన గోడపత్రికలు, కరపత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. కబేళాల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటుచేయాలన్నారు.
పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టరు డా. కె. విద్యాసాగర్ గోవధ నిషేధ చట్టం, పశుసంరక్షణ చట్టం-1977, ట్రాన్స్ పోర్టు రూల్స్ గురించి వివరించారు. సిసియస్ డియస్ పి సిహెచ్. మురళీకృష్ణ మాట్లాడుతూ గోవధలకు ఆస్కారం లేకుండా గట్టి పోలీస్ నిఘాతో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను గుర్తించి గోవధ నియంత్రణకు తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా గోవధ నిషేధంపై అవగాహన కలిగించే కరపత్రాలను జెసి (సంక్షేమం) కె. మోహన్ కుమార్ ఆవిష్కరించారు. ఈసమావేశంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టరు డా. కె. విద్యాసాగర్, డిపిఓ ఏ.డి. జ్యోతి, డిఇఓ త హేరా సుల్తానా, సిసియస్ డియస్ పి సిహెచ్. మురళీకృష్ణ మార్కెటింగ్ డిడి యం. దివాకర్ రావు, వియంసి ఏహెచ్ అసిస్టెంట్ డైరెక్టరు డా. కె. రవిచంద్, కమిటి సభ్యులు గోశాల కార్యదర్శి గోవింద్ కుమార్ సాబూ, రిటైర్డు పశుసంవర్ధక శాఖాధికారి వి.షణ్ముఖరావు, డి.వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *