-కోవిడ్ పై నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు పాటించండి…
-యయంయస్ పాటించడం ద్వారా 3వ వేవ్ రాకుండా జాగ్రత్త పడదాం…
-సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువు దాటకముందే వాటిని పరిష్కరించాలని విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ సంబంధి తాధికారులకు సూచించారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుండి వినతిపత్రాలను సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్ స్వీకరించారు. వివిధ సమస్యలపై అందిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు వాటి పరిష్కారం నిమిత్తం పంపడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తి పూర్తిగా అంతరించ లేద న్న విషయాన్ని గుర్తుంచుకుని మూడవ వేవ్ రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధి సోకిన తర్వాత ఇబ్బంది పడేకంటే అది ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టడం ఉత్తమ మార్గం అన్నారు. మాస్క్ ధరించడం, శానిటైజేషన్,
భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించినట్లయితే 3వ వేవ్ రాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కూడా ఈకోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు. కోవిడ్ కేసులు అధికంగా ఉన్న మండలాల ప్రత్యేక అధికారులు పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.