విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తమ్మిరెడ్డి శివ శంకర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లాలో కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ తమ్మిరెడ్డి శివ శంకర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లాలో అన్ని 15 నియోజకవర్గాలలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మరియు 50 వయస్సు పై వారికి 10,000 మంది కి అభినవ ధన్వంతరి కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. చిన్న వాల్తేరు లో పీతల వీధి, యాదవ సామాజిక భవనం వద్ద 1500 మంది స్ధానిక ప్రజలకు, మరియు మేఘాలయ హోటల్లో 10000 మంది విశాఖలోని 15 నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ ప్రతినిధులకు మందు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జనసేన రాష్ట్ర కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు గొలగాని రవికృష్ణ తన తల్లిదండ్రులు పేరు మీద గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు మహత్తర మైనవి అని ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగకరంగా ఉన్నాయని రవి కృష్ణకు అభినందనలు తెలిపారు. జనసేన రాష్ట్ర మాజీ సోషల్ జస్టిస్ కో కన్వీనర్ గింజాల శ్రీనివాస రావు సోదరుడు రవి కృష్ణ తనకు అత్యంత ఆప్తుడని రవి కృష్ణ ఇప్పటికే కృష్ణ , గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 30000 మందికి కరోనా నివారణ మందు పంపిణీ చేసారని, ఆయన చేస్తున్న ఈ సేవ కార్యక్రమాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు, జనసేన నాయకులు వన్నెం రెడ్డి సతీష్, శ్రీనివాస్ పట్నాయక్, యశోద కృష్ణ సేవ సమితి అధ్యక్షులు దుక్కా వేణు, విజయవాడ చిరంజీవి యువత ఉపాధ్యక్షులు తోట కోటి, దుబాసి వాసుదేవ రావు, బోరా రాజేష్, విజనగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags Visakhapatnam
Check Also
బాస్కెట్ బాల్ టోర్నమెంట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Maris Stella college, Krishna University సంయుక్తంగా గా ఇంటర్ colkegiate బాస్కెట్ …