తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తడి,పొడి చెత్త సేకరణ ప్లాంట్ ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగ అమలు చేస్తామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ అన్నారు. తిరుపతి నగరంలో సేకరించిన చెత్తను తూకివాకం దగ్గర ఏర్పాటుచేసిన ప్లాంట్ లో శుద్ది చేసే యూనిట్ ను సోమవారం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ మాట్లాడుతూ తిరుపతి నగరంలో సేకరించిన తడి చెత్తను చాలా చక్కగా ఎరువులుగా తయారుచేసి ఉపయోగించడాన్ని ప్రసంసించారు.అదేవిధంగ భవన వ్యర్ధాలను బ్రిక్స్ గా మార్చడం భాగుందని,తూకివాకం లాంటి ప్లాంట్లను ఆదర్శంగ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగ మునిసిపాలిటిల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.ఈ విధానాల వల్ల చెత్తను పూర్తిగా నిర్మూలించడంతోపాటు, తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అభినందనీయమని కమిషనర్ గిరీషా పనితీరును ఆమె ప్రసంసించారు. కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ తడి,పొడి చెత్తతో బాటు భవన నిర్మాణ వ్యర్ధాలను సేకరించి వాటిని రకరకాలు విభజించి తిరిగి వినియోగంలో తీసుకురావడం జరుగుతుందన్నారు. తడిచెత్త నుండి ఎరువులు తయారుచేసి రైతులకు,కావల్సిన వారికి నామమాత్రపు రుసుంతో అందించడం జరుగుతున్నదన్నారు.పొడి చెత్తను కూడా వినియోగించేలా చూస్తున్నామని ముఖ్యంగ పుట్ పాత్ లపై సిమెంట్ బ్రిక్స్ లుగా ఉపయోగంలోకి తీసుకురావడం జరిగిందని,తొందర్లోనే పొడి చెత్త ప్లాంట్ ను పూర్తిచేసి అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి,ఎస్.ఈ మోహన్,ఎం.ఈలు చంద్రశేఖర్,వెంకట్రామి రెడ్డి,ఆర్వో సేతుమాధవ్, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి,ఏఈకామ్ ప్రతినిధి భాలాజీ,తడి చెత్త శుద్ది నిర్వాహకురలు రాధాదేవి,జ్యోతి నెహ్రూ,చందన్ లు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …