Breaking News

శ్రీశ్రీ కళావేదిక మరో ఘనత…


-మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ లో స్థానం శ్రీ శ్రీ కళావేదిక సొంతం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సాహిత్య చరిత్రలో ఐ ఎస్ ఓ (ISO) గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈమేరకు వేదిక జిల్లా అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, ఉపాధ్యక్షులు డా.జెన్నె ఆనందకుమార్, ప్రధానకార్యదర్శి కొత్తపల్లి సురేష్, కార్యదర్శులు కోటిగారి వన్నప్ప, టివి రెడ్డిలు హర్షం వ్యక్తంచేశారు. జాతీయ ఛైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ సాహిత్యకృషికి, సేవానిరతికి నిదర్శనమన్నారు. కత్తి కన్నా కలం గొప్పదని గట్టి నమ్మకంతో కలాన్ని సంధించాలి, స్పందించాలి. భాషకు, భావోద్వేగానికి కవిత్వం ప్రాధాన్యత కల్పించాలి. కవిత్వం ఒక చైతన్యం, కవిత్వం ఒక సామాజికం. అందుకే కవిత్వం చిరస్థాయిగా నిలవాలంటే కవికి, కవిత్వానికి సామాజిక స్పృహ ఉండాలని అనుక్షణం ఎందరో కవులకు,రచయితలను ప్రోత్సహిస్తుంది శ్రీ శ్రీ కళావేదిక. అత్యధిక కవి సమ్మేళనాలు నిర్వహించి, వేలాది కవులను కళాకారులను, సాహిత్యకారులను సత్కరించిన సంస్థగా శ్రీ శ్రీ కళావేదిక మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ లో నమోదయిందని వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ రికార్డుల నమోదుకు చెందిన మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్ -ఇంటర్నేషనల్ లో శ్రీ శ్రీ కళావేదికను నమోదు చేయడం గర్వకారణమన్నారు. అరుదైన ప్రపంచ రికార్డ్ సాధించడం జాతీయ ఛైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ అంకితభావానికి నిదర్శనమన్నారు. అత్యంత ప్రమాణాలతో సాహిత్య సేవ చేస్తున్న శ్రీ శ్రీ కళావేదిక మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు కావడం శ్రీ శ్రీ కళావేదిక కవులందరికి గర్వకారణం. ఇది మనందరి విజయం. ఈ విజయంలో భాగస్వాములైన అందరికి హృదయపూర్వక అభివాదములతో ఈ ఘన విజయం సాధించిన ప్రభుత్వ గుర్రం జాషువా అవార్డు గ్రహీత,అక్షర తపస్వి, శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్  డా.కత్తిమండ ప్రతాప్ గారికి హృదయపూర్వక అభినందనలు..

Check Also

అమరావతికి కొత్తరైల్వే లైన్‌ మంజూరును స్వాగతిస్తున్నాం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతికి కొత్త రైల్వే లైన్‌ మంజూరు చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *