రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం డిసెంబర్ 30 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. విజయవాడలో రెవిన్యూ శాఖ మంత్రి నిర్వహించే రెవిన్యూ ప్రాంతీయ సదస్సు కు కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ హాజరుకానున్న దృష్ట్యా జిల్లా రెవిన్యూ అధికారి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. డి ఆర్వో , ఇతర జిల్లా అధికారులు సోమవారం ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. రెవెన్యూ, మునిసిపల్, మండల స్థాయి లో అర్జీలను క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక లో అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు. మండల స్థాయి అధికారులు అందరూ మండల ప్రధాన కేంద్రంలో ఒకే చోట హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …