విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ లోని మాజీ సైనిక సంఘ నాయకులoదరూ కలిసి ఒక తాటిపై వచ్చి, మన సమస్యలు పరిష్కరించడం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ రూపొందించడం కోసం ఈనెల జనవరి 03 తారీఖున 10 గంటలకు రిలయన్స్ ట్రెండ్ పైన ఉన్న హాల్లో, మణిపాల్ హాస్పిటల్ దగ్గర, విజయవాడ. రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పాటు చేయడం కోసం నిశ్చయించారు.కాబట్టి మాజీ సైనికుల నాయకులు అందరు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బుదవారం జేఏసీ కార్యవర్గం ఎన్ ఈ ఎక్స్ సి సి, ఏ పి రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం మరియు మాజీ సైనికులు హక్కుల పోరాట సమితి ప్రకటన విడుదల చేసింది.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …