-బాలాజీ కాలనీలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద పోలీస్ యూనిట్ హాస్పిటల్ ప్రారంభం
-తిరుపతి అర్బన్ జిల్లా యస్. పి. వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి స్థానిక బాలాజీ కాలనీలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద గురువారం పోలీస్ యూనిట్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక యం. ఎల్. ఎ. భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్, మునిసిపల్ కమిషనర్ పీ.ఎస్ గిరీషా ఐ.ఎ.యస్ పాల్గొనారు.
ఈ సందర్భంగా జిల్లా యస్. పి. మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులతో పాటు, సామాన్య ప్రజలకు కూడా ప్రాథమిక వైద్య సేవలు అందించేలా, మెరుగైన సౌకర్యాలతో పోలీస్ యూనిట్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్స్, క్యాసువాలిటి, ఓ.పి. విభాగము, ఇ.సి. జి., రక్త పరిక్షలు మొదలగు సేవలు అన్ని వైద్యుల పర్యవేక్షణలో పోలీస్ యూనిట్ ఆసుపత్రి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి కి మరియు కమీషనర్ గిరీష్ కుమార్ కి అభినందనలు తెలుపుకుంటున్నాను. సమాజంలో ఎవరికైనా భాద వస్తే పోలీసు కార్యాలమునకు మరియు హాస్పటల్ కు వెళతారు. ఈ రెండు నాకు దేవాలయాలతో సమానము, హాస్పిటల్ నందు పోలీస్ సిబ్బంది వారి కుటుంబానికి కాకుండా ఇక్కడ ఉన్న ఎవరికైనా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పాత భవనమును పునర్నిర్మించి అతి తక్కువ ఖర్చుతోనే ఈ హాస్పిటల్ ను నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రథమ స్థాయిలో ల్యాబ్ మరియు టెక్నీషియన్లు అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క సేవలను పోలీసు వారు మరియు కుటుంబ సభ్యులు వినియోగించుకుంటారు అని భావిస్తున్నాను. పూర్తి స్థాయిలో సేవలు అందించగలిగే ఒక అవకాశం అని భావిస్తున్నారు. పోలీసు కుటుంబాలతో పాటు, సామాన్యు ప్రజలకు కూడా ప్రాథమిక వైద్య సేవలు అందించేలా, మెరుగైన సౌకర్యాలతో పోలీస్ యూనిట్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం శుభపరిణామం గా పేర్కొన్నారు.
యం. ఎల్. ఎ. భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ జిల్లా సూపరింటెండెంట్ అప్పల నాయుడు నేతృత్వంలో తిరుపతి లో మొదటి సారిగా పోలీసువారి ఆధ్వర్యంలో ఓ హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్యశాల పోలీసు సిబ్బందికి కాకుండా ఇక్కడ చుట్టుపక్కల స్థానిక ప్రజలకు ప్రధమ చికిత్స చేయడమే కాకుండా ఇక్కడ చిన్న చిన్న జబ్బులకు సంబంధించి డాక్టర్ ఇక్కడ అందుబాటులో ఉండి వారికి కావలసిన ప్రథమచికిత్స చేయడమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం తో పాటు దానికి సంబంధించిన టెక్నీషియన్ ఇక్కడ అందుబాటులో ఉంటారు. గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సమస్యలను కూడా చికిత్స చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి తిరుపతి అర్బన్ ఎస్పీ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ హాస్పిటల్ లో పోలీస్ వారికే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలందరూ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మునిసిపల్ కమిషనర్ పీ.ఎస్. గిరీషా ఐ.ఎ.యస్ మాట్లాడుతూ మునిసిపల్ పరిధిలో పి.హెచ్. సి. సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నాము. ఈ రోజు జిల్లా యస్. పి. గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన బాలాజీ కాలనీలో ఏర్పాటైన పోలీస్ హాస్పిటల్ చుట్టు ప్రక్కల రెండు మూడు వార్డులకు మధ్యలో ఉండడం సంతోషకరమైన విషయము. ప్రాధమిక స్థాయిలో ఆరోగ్య పరిస్థితి ఉన్నపుడు ఇక్కడ కూడా చూపించుకోవచ్చు. ఈ పోలిస్ హాస్పిటల్ నందు డిస్ట్రిక్ట్ పోలీస్ డాక్టర్ టో పాటు టెక్నీషియన్స్ కుడా అందుబాటులో ఉంటారు.
ఈ కార్యక్రమములో అడిషనల్ యస్. పి. లు అడ్మిన్ ఇ.సుప్రజా మేడం, లా & ఆర్డర్ అరిఫుల్లా, తిరుమల మునిరామయ్య, పోలిస్ యూనిట్ డాక్టర్ కవిత, డి. యస్. పి. లు ఈస్ట్ మురళీ కృష్ణ, వెస్ట్ నరసప్ప, ట్రాఫిక్ మల్లికార్జున, ఎ. ఆర్. నంద కిషోర్, లక్ష్మణ్ కుమార్, సి. ఐ., ఆర్. ఐ లు పాల్గొన్నారు.