-ఎమ్మెల్యే కారుమూరి తో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు
తణుకు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలన గతంలో చూడలేదు, భవిష్యత్తు లో చూడగలమా అన్న రీతిలో మహిళలు, రైతుల, బడుగు బలహీన వర్గాలకు మెరుగైన పరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణా దాస్ పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర ఉపముఖ్య మంత్రి రెవిన్యూ & రిజిష్ట్రేషన్ శాఖా మంత్రి ధర్మాన కృష్ణ దాస్, తణుకు శాసన సభ్యులు డా.కారుమూరి వెంకట నాగే శ్వరరావు తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా తణుకు రిజిస్టర్ కార్యాల యం, మండల తాహిసి లదార్ కార్యాలయం ను పరిశీలించారు. వేల్పూరు పిబిఆర్ గ్రౌండ్ నందు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించి వారి గౌరవ మర్యాదలను ఇనుమడింప చేసిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 30.65 లక్ష ల ఇళ్ల పట్టాలను మహిళలు పేరున రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే, అందుకే జగనన్న కు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారన్నారు. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. జగనన్న తాను ఇచ్చిన హామీల కంటే మిన్నగా హామీలు నెరవేర్చారని తెలిపారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. రెండేళ్ల సంక్షేమ పాలనను చూసి 75 పురపాలక సంఘాల ఎన్నికల్లో 74 చోట్ల ఈ ప్రభుత్వాన్నీ గెలిపిస్తే, ఇంకా కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతూ వారి అవివేకాన్ని ప్రదర్శిస్తున్నారని కృష్ణదాస్ పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం…
రాష్ట్రంలో 62/63 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, . మరి వారి జీవనం ఎలా ఉంది? అన్నది తెలుసుకోకుండా, వారి బతుకులు మార్చకుండా, ఏవో నాలుగు బిల్డింగ్‌లు కడితే దాన్ని అభివృద్ధి అంటారా? లేక ఆ గ్రామాల్లోనే రైతుల చేయి పట్టుకుని అడుగులు వేస్తూ, విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతుకు తోడుగా ఉండడం అభివృద్ధి అంటారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా ఏమాత్రం కల్తీ లేని విత్తనాల దగ్గర నుంచి ఎరువుల, పురుగు మందులు సరఫరా చేయడమే కాకుండా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాకుండా, చివరకు పంటలు అమ్ముకునేందుకు కూడా ఆర్బీకేలు తోడుగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు. ఏలూరు బిసి గర్జన సమయంలో బిసి లకు అండగా ఉంటామని చెప్పి బిసి, మైనార్టీ, ఎస్సి, ఎస్టీ లకు మంత్రి పదవి ఇచ్చి సముచితంగా గౌరవీచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ అన్నారు. అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తూ, పేద ప్రజల కోసం తపించే గొప్ప నాయకుడిగా ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు , అర్హులైన వారికి అందించాలనే లక్ష్యం తో పనిచేస్తున్నామన్నారు. మహిళలకు భద్రత,, భరోసా కల్పించాలని లక్ష్యంతో దిశా చట్టాన్ని తీసుకుని రావడమే కాకుండా, దోషులకు 21 రోజుల్లో శిక్షలు పడే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఎవరి విమర్శలకు తలవోగ్గే ప్రసక్తి లేదని, సంక్షేమం కోసం పని చెయ్యాలని ముఖ్యమంత్రి ఆలోచనలు తో ముందుకు వెళుతున్న ట్లు ధర్మాన కృష్ణా దాస్ అన్నారు. తణుకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు నిబద్ధత కలిగిన నాయకుడు అని, ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మరిన్ని కార్యక్రమలు చేపట్టే దిశలో ఆయన ఇచ్చిన విజ్ఞప్తుల ను తప్పనిసరి గా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టు లలో, పనుల్లో 50 శాతం పైగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. వైఎస్సార్ వారసుడు గా జగనన్న పాలన సాగుతోందని, రైతు సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తుందనడానికి అమ్మఒడి, ఆరోగ్యశ్రీ , అర్భికే లే నిదర్శనం అన్నారు. జగనన్న సంక్షేమ పాలన, పథకాల గురించి మాట్లాడితే 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది అని ఆయన తెలిపారు. శాసన సభ్యులు డా.కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, తమది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కలసిన సంక్షేమ రాజ్యం ప్రభుత్వం అన్నారు. పచ్చ కామెర్లు వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనే సామెత చందంగా కొందరి విమర్శలు ఉన్నాయన్నారు., గత ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పధకాలను నీరుగార్చిందని, జగనన్న ప్రభుత్వానికి మహిళలు, బిసిలు, ఎస్సి ఎస్టీ, మైనార్టీ, పేదలు మద్దతు ఇస్తున్నారన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోగత 15 సంవత్సరాలుగా 22 ,152 ఇళ్ళు మంజురూ చేస్తే, తమ ప్రభుత్వం 18,571 ఇళ్ళు మంజురూ చేశామన్నారు. పేదల ఇంటి నిర్మాణం కోసం రూ.3342.78 కోట్ల ను వెచ్చించడం జరుగుతుందని శాసన సభ్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్వంత ఇంటి సాకారం కోసం 138 లే అవుట్లలో 15,939 మంది లబ్ధిదారుల కుటుంబాలకు మహిళలు పేరున ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఇందుకోసం 354 ఎకరాల భూమిని సేకరించి, రూ.33.40 కోట్లు చెల్లింపు జరిగిందన్నారు.
పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలు…
ఉప ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా స్టేషన్ రోడ్ లోని మాంటిస్సోరి స్కూల్ వద్ద రూ.120 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు ను ప్రారంభించారు. రూ.40 లక్ష లతో నిర్మించిన వేల్పూరు గ్రామ సచివాలయం 1 ను ప్రారంభించారు. వేల్పూరు గ్రామం బాలాజీ నగర్ నందు రూ.260 లక్షలతో పూర్తి చేసిన 7 సిసి రోడ్లను, రూ.52 లక్షలతో నిర్మించిన 4 డ్రైన్స్ లను ప్రారంభించారు. రూ.40 లక్ష లతో నిర్మించిన కాకిలేరు గ్రామ సచివాలయం ను ప్రారంభించారు. రెవెన్యూ ఉద్యోగులు సంఘం నాయకులు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ను సన్మానించారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. పర్యటనలో భాగం కె.కుముదవల్లి లో గ్రామంలో భూముల సమగ్ర సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో స్థానిక శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జాన్ మోషేన్ రాజు, ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి, వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు, ఛైర్ పర్సన్స్ సభ్యులు, వంకా రవీంద్ర నాధ్, గుబ్బల తమ్మయ్య, పేండ్ర వీరన్న, పెనుమత్స సుబ్బరాజు, చిట్టూరి సుబ్బయ్య, బి.వీర్రాజు, ఎస్సెస్ రెడ్డి, తణుకు, అత్తిలి ఏయంసి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.