విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రెవెన్యూ డివిజన్ లోని 50 గ్రామాల్లో డ్రోన్ ఫ్లయ్యింగ్ నిమిత్తం గ్రామసరిహద్దుల నిర్ధారణ, గ్రామకంఠం సరిహద్దుల నిర్ధారణ ఆగష్టు 5 నుంచి ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని భూపరిపాలనా ముఖ్య కమిషనరు సంబంధి తాధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తదితర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో యంఐజి లేఅవుట్లు, లేఅవుట్లు, రీసర్వే విషయాలపై సిసియల్ పై సమీక్షించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరు జె. నివాస్ పాల్గొనగా, విజయవాడ సబ్ కలెక్టరు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టరు డా. కె.మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్, జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సిసియల్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకూ 745 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై నిర్వహించడం జరిగిందన్నారు. త్వరలోనే 177 గ్రామాలకు సంబంధించి డ్రోన్ ఇమేజెస్ (ఓఆర్ఐ మ్యాప్స్) అందుబాటులోనికి రానున్నాయన్నారు.
Tags vijayawada
Check Also
కరుణానిధి స్ఫూరితోనే బీసీల *మనుగడ, తమిళనాడు తరహా అభివృద్ధి
-బీఎస్పీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్రరావు -“సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలికి ఎన్ఠీఆర్ మనవడు …