అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం గెలుచుకొని మన దేశానికి మరో పతకాన్ని అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కార్యాలయం నుండి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసారు. టోక్యోలో మన దేశ పతాకం మరోమారు రెపరెపలాడేలా చేసిన సింధుని చూసి దేశమంతా గర్విస్తోంది. అప్పుడు రియోలోనూ, ఇప్పుడు టోక్యోలోనూ… వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా సింధు సాధించిన రికార్డుతో క్రీడాభిమానులు మురిసిపోతున్నారు. ఒలింపిక్స్ వేదికపై సింధు పోరాట పటిమకు జేజేలు పలుకుతున్నారు. విజయం కోసం సింధు పోరాడిన తీరు, బ్యాడ్మింటన్ లో ఆమె ఎదిగిన విధానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. క్రీడా రంగంలో సింధు ఘన విజయాలు సాధించేలా తీర్చిదిద్దిన ఆమె తల్లితండ్రులు విజయ, పి.వి.రమణలకు, క్రీడా శిక్షకులకు అభినందనలు. పి.వి.సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …