-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం
-తలసరి ఆదాయం రూ.4లక్షలకుపైగా సాధాన లక్ష్యం
-ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి 4 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధంగా ఉందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆమె తమ జిల్లా ప్రగతి గురించి ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లాలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు స్థాపించడానికి ముందుకొచ్చే వారికోసం భూములు సిద్ధంగా ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగంలో, పర్యాటక రంగంలో ఏలూరు జిల్లాను అభివృద్ది చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో పామాయిల్ విస్తృతంగా సాగుచేయడానికి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ద్వారాకా తిరుమల ఆలయంతో పాటు జిల్లాలోని మిగిలిన ఆలయాలు, పొరుగు జిల్లాల్లోని దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం, పాపికొండలు తదితర ప్రాంతాలన్నీ ఉదయం నుంచి సాయంత్రం లోపు చూసి వచ్చేలా ప్రణాళికలు రూపొందించి పర్యాటకులను ఆకర్షిస్తున్నామన్నారు. తలసరి ఆదాయం రూ.4లక్షలు సాధన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో మామాడి రైతులు ఎక్కువగా ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.