-అప్పులు తీర్చడానికే కష్టంగా మారిన బడ్జెట్…
-విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మెరుగుపరుస్తాం..
-పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తా.
సుజనా మిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలిసి ఆయన భవానిపురంలో సుజన మిత్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే వ్యవస్థను రూపొందించారు.. సుజనా మిత్ర లకు ఇచ్చిన ఎలక్ట్రిక్ బైకులను ఎమ్మెల్యే సుజనా కూటమినేతలతో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుజన చౌదరి తనకు మంచి స్నేహితుడని ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాకి అపారమైన అనుభవం ఉందని, ప్రజాసేవకే ఆయన నిత్యం తపిస్తారని చెప్పారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేదన్న మంత్రి నారాయణ ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందన్నారు. 2019 లో ఏఐఐబి నుంచి 5380 కోట్ల నిధులు తీసుకొచ్చామని, కానీ గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధుల విడుదల నిలిచిపోయిందనీ గుర్తుచేశారు. గత ప్రభుత్వం నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135 లీటర్ల నీరందించే అవకాశం కలిగి ఉండేదన్నారు. మళ్ళీ సీఎం చంద్రబాబు చొరవతో నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
.విజయవాడ పశ్చిమ అభివృద్ధికి తన వంతు సహకారం పూర్తిగా అందిస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుజనా మిత్ర ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు..
ప్రజలు, ప్రజా ప్రతినిధుల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు..
సుజనా మిత్రల కు సుజనా ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లను అంద చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజా ప్రతినిధులు కులమతాలకతీతంగా నిస్వార్ధంగా ప్రజాసేవచేసి పదవులకు వన్నె తేవాలని పిలుపు నిచ్చారు..
భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో సుజనా మిత్ర కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ , సామినేని ఉదయభాను, నాగుల్ మీరా, ఎమ్ ఎస్ బేగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని , అందరి సమన్వయం తో కలసికట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు. తాను పేరుకు మాత్రమే ఎమ్మెల్యేనని ప్రజలకు మాత్రం సేవకుడిగా ఉంటానని, అవినీతిరహిత పాలన అందిస్తూ ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.
పశ్చిమ నియోజకవర్గంలో చందాలు, దందా లకు తావు లేకుండా పాలన సాగిస్తున్నామన్నారు..
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమంలోని 22 డివిజన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టానన్నారు . అందులో భాగంగానే మొదటిగా మూడు దశల్లో డెవలప్మెంట్ ఫోరం లను ఏర్పాటు చేశామన్నారు.. నియోజకవర్గం, జోన్, డివిజన్ ప్రాతిపదికగా ఈ
ఫోరం లను ఏర్పాటు చేశానని వివరించారు. ఫోరం లకు, ప్రజలకు అనుసంధానంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుజనా మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నారు. అసాంఘిక శక్తులను ఉపేక్షించకుండా డ్రగ్స్, గంజాయి వంటి వాటి మీద ఉక్కు పాదం మోపాలన్నారు. పైరవీలకు స్వస్తి పలుకుతూ రాజకీయాలకు కులమతాలకతీతంగా నియోజవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు.
అభివృద్ధిలో వెనుకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని గాడిన పెట్టడానికి మేధ దానం, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, వైద్యులు, శ్రమదానం,చేసి అభివృద్ధికి సహకరించాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజలందరి భాగస్వామ్యంతో పశ్చిమాన్ని అభివృద్ధి చేస్తానని సుజనా హామీ ఇచ్చారు. సుజనా ఫౌండేషన్ అడ్వైజర్ వేజెండ్ల శ్రీనివాస్ రావు డెవలప్మెంట్ ఫోరం లు, సుజనా మిత్ర ల వ్యవస్త పని చేసే తీరును పవర్ పాయింట్ ద్వారా వివరించారు..
ఈ సందర్భంగా 22 మంది సుజన మిత్ర లకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అంద చేశారు.. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కూటమి నేతలు బొమ్మసాని సుబ్బారావు, కోగంటి రామారావు, అమ్మిశెట్టి వాసు, బాడిత శంకర్, పైలా సోమినాయుడు, ఫతాఉల్లా, బుల్లా విజయ్ కుమార్, మైలవరపు దుర్గారావు, మహాదేవు అప్పాజీరావు, మరుపిళ్ళ రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, గుడివాడ నరేంద్ర రాఘవ, పోతిన భేసు కంటేశ్వరుడు యేదుపాటి రామయ్య, తిరుపతి అనూష, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News