అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా 2 వ రోజు జోన్-4 లోని ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా ప్రగతి ప్రణాళికలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్షిస్తూ…..
నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ కి చెందిన 124 ఎకరాల భూమిని పారిశ్రామిక అభివృద్ధికై ఏపీఐఐసీ కేటాయించేలా చర్యలు చేపట్టాలి. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.28 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది
చిత్తూరు జిల్లాలో 3.65 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా లైవ్ స్టాక్ ప్రాజెక్టు అమలుకై ప్రతిపాదించడంపై అభినందనలు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద మొత్తంలో సంపదను సృష్టించి చిట్ట చివరి నిరుపేద వరకు ఆ సంపదను పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇదే తరహా లైవ్ ప్రాజెక్ట్ను అన్ని జిల్లాల్లో ప్రతిపాదిస్తూ సంపదను సృష్టించడమే కాకుండా ఆ సంపద చిట్ట చివరి నిరుపేద వరకు అందేలా చూడాలి
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో వృద్ధి నైపుణ్యాన్ని పెంచే ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులను నిర్వహించాలి
ఇందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఐదు జోన్ల వారీగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల ద్వారా ఈ వృత్తి నైపుణ్యం కోర్సులు నిర్వహించాలి.
అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళా నిర్వహించాలి
తిరుపతి జిల్లాలో కడప – రేణిగుంట, పీలేరు- కాలేరు జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన ఫారెస్ట్, ఎన్ హెచ్ ఐ క్లియరెన్స్ లను సత్వరమే ఇవ్వాలి
అన్నమయ్య జిల్లాలో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ మరియు ఎన్ఆర్ఈజిఎస్ ప్రాజెక్ట్ కింద 4,319 హెక్టార్లలో
హార్టికల్చర్ ప్రాజెక్టు అమల్లో భాగంగా మామిడి తోట్ల పెంపకము మరియు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలుకు ఆమోదం తెలిపారు.
అయోధ్యలో చాలామంది భూములు కొనుక్కొని సెటిల్ అవుతున్నారని, అదే తరహాలో తిరుపతి డివైన్ ప్లేస్ గా అభివృద్ధి పరచాలి.
ప్రకాశం జిల్లా 19.46% , నెల్లూరు జిల్లా 14.45%, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు 13.22% మరియు తిరుపతి 12.08% గ్రోత్ రెట్ సాధన లో వరుసగా నిలిచినట్లు తెలిపారు.
జోనల్ ఇన్చార్జి ఎంటి కృష్ణ బాబు మాట్లాడుతూ తమ జోన్ లోని జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన జిల్లా ప్రణాళికలను పటిష్టంగా అమలు పరిచేందుకు చర్యలు చేపడతాము.
ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల జిల్లా కలెక్టర్ వారి జిల్లాలలో 15% ప్లస్ గ్రోత్ రేట్ సాధించే విధంగా జిల్లా ప్రగతి ప్రణాళికలను మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాల్సిన నిర్ధిష్ట సమస్యలను ఈ సమావేశంలో వివరించారు.
Prajavartha Online Telugu News