అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని పేదరిక నిర్మూలన అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని రాష్ట్ర శాసన సభ స్వీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అమరావతి అసెంబ్లీ భవనంపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని అప్పుడే దానికి సార్దకత చేకూరుతుందని పేర్కొన్నారు.ముఖ్యంగా సమాజంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు తొలగి అందిరికీ సమాన అవకాశాలు కల్పించడం,పేదరిక నిర్మూలన ద్వారానే జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని పేర్కొన్నారు.ఈ75 యేళ్ళ కాలంలో దేశం అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని ఇంకా చాలా సాధించాల్సి ఉందని చెప్పారు.నేడు దేశం అనేక సవాళ్ళను ఎదురుకుంటోందని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కృషి చేయాల్సి ఉందని తెలిపారు. నేడు దేశ సరిహద్దుల్లో అనేక కవ్వింపు చర్యలు జరుగుతున్నాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మన సైనిక బలగాలు కృషి చేస్తున్నాయని వారికి సంఘీభావంగా ప్రతి పౌరుడు ఒక సైనికునిగా తయారు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అసువులు బాషిన వారందరికీ మనందరం ఘణంగా నివాళులు అర్పించాల్సిన తరుణమిదని చెప్పారు.రాష్ట్రంలో పేదల సంక్షమానికి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేస్తోందని వాటిని ప్రతి ఒక్కరికీ అందేలా చేసి సమాజం నుండి పేదరికాన్ని పూర్తిగా రూపు మాపాలన్సిన అవసరం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యలు,ఇంకా పలువురు అసెంబ్లీ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …