Breaking News

వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్య సేవలు… : మంత్రి కొడాలి నాని

-కాంట్రాక్టర్ సత్యభూషణ్ కు ఘన సన్మానం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా డాక్టర్లు గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలందిస్తారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేజ్ క్లినిక్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను మంత్రి కొడాలి నాని వివరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వచ్చే డిసెంబర్ నాటికి గ్రామీణ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. వీటి కోసం 7 వేల 112 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 2 వేల 920 క్లినిక్స్ లో ఎంఎల్ హెచ్పీలు అందుబాటులో ఉన్నారని తెలిపారు. విలేజ్ క్లినిక్స్ లో 12 రకాల వైద్య సేవలు అందుతాయన్నారు. 14 రకాల వైద్యపరీక్షలు జరుపుతున్నామన్నారు. అలాగే 65 రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. టెలీమెడిసిన్ సేవలను కూడా అందజేస్తున్నామన్నారు. 67 రకాల వైద్య పరికరాల ద్వారా వైద్య సేవలు అందుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేల 032 విలేజ్ క్లినిక్స్ లో ఇప్పటికే 24 గంటలూ ఏఎన్ఎంలు అందుబాటులో ఉన్నారని తెలిపారు. పీహెచ్ సీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేజ్ క్లినిక్స్ కు అనుసంధానం ఉంటుందన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారన్నారు. రాష్ట్రంలో 8 వేల 585 గ్రామీణ హెల్త్ క్లినిక్స్ భవనాలను రూ.1,466.80 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ఈ భవనాల్లో ఓపి రూం, ఎగ్జామినేషన్ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, ఏఎన్ఎం క్వార్టర్స్ ఉంటాయని మంత్రి కొడాలి నాని తెలిపారు. అనంతరం కాంట్రాక్టర్ యార్లగడ్డ సత్యభూషణను ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ నివాస్ కూడా సత్యభూషణను అభినందించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ భవనాలను నిర్మించడం జరిగిందని కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శోభిక, డ్వామా పీడీ గోర్జి సూర్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ, వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నేతలు పాలడుగు రాంప్రసాద్ , గాదిరెడ్డి రామలింగారెడ్డి, మురారి నగేష్, పొడిచేటి కృష్ణ, గోవాడ చంటి, తాజుద్దీన్, గోళ్ళ రామకృష్ణ, కలపాల కిరణ్, యార్లగడ్డ మురళి, నైనవరపు శేషుబాబు, బంటుమిల్లి సూర్యనారాయణ, మేకల సత్యనారాయణ, సత్యదుర్గాప్రసాద్, పెనుమూడి రమేష్, దొండపాడు మురళి, బచ్చు మణికంఠ, గంటా శ్రీను, కొండపల్లి కుమార్‌ రెడ్డి, మొండ్రు వెంకటేశ్వరరావు, నగుళ్ళ సత్యనారాయణ, మాదాసు వెంకటలక్ష్మి, చుండూరి శేఖర్, అలీబేగ్, రంగా, యార్లగడ్డ సత్యభూషణ్, గుత్తా నాని తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *