గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ నియోజకవర్గం రూరల్ మండలం మల్లాయిపాలెంలోని శ్రీషిర్డీ సాయిబాబా ఆలయాన్ని శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, అసిస్టెంట్ కలెక్టర్ శోభికకు పుష్పగుచ్ఛాలను అందజేసి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ గోర్జి సూర్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ, వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నేతలు పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మురారి నగేష్, పొడిచేటి కృష్ణ, గోవాడ చంటి, తాజుద్దీన్, గోళ్ళ రామకృష్ణ, కలపాల కిరణ్, యార్లగడ్డ మురళి, నైనవరపు శేషుబాబు, బంటుమిల్లి సూర్యనారాయణ, మేకల సత్యనారాయణ, సత్యదుర్గా ప్రసాద్, పెనుమూడి రమేష్, దొండపాడు మురళి, బచ్చు మణికంఠ, గంటా శ్రీను, కొండపల్లి కుమార్ రెడ్డి, మొండ్రు వెంకటేశ్వరరావు, నగుళ్ళ సత్యనారాయణ, మాదాసు వెంకటలక్ష్మి, చుండూరి శేఖర్, అలీబేగ్, రంగా, యార్లగడ్డ సత్యభూషణ్, గుత్తా నాని తదితరులు పాల్గొన్నారు.
Tags gudivada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …