నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని పరిశ్రమల యజమానులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి హెచ్చరించారు పరిశ్రమల లో ప్రమాదాల నివారణకు ఏర్పాటయిన డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం ఆర్ డి ఓ కె. రాజ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు అధికారులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని, ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. కమిటీ సభ్యులు తమ పరిధిలోని పరిశ్రమలను ముఖ్యంగా రసాయనిక పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు ఆయా పరిశ్రమల యాజమాన్యాలు తీసుకుంటున్న భద్రతా చర్యలను పరిశీలించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా నివారణ తో తీసుకోవాల్సిన చర్యలు వారికి తెలియజేయాలన్నారు తనిఖీ చేసిన అధికారులు తమ నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. రసాయనిక పరిశ్రమలు లో రసాయనాలు , గ్యాస్ లీకేజ్ వంటి ప్రమాదాలు జరగకుండా పరిశ్రమల యజమానులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఫ్యాక్టరీ యజమానులు భద్రతా చర్యలు తీసుకునేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ఇన్స్పేక్టర్ ఆఫ్ ఫ్యార్టరీస్ టి. రాజు, డిప్యూటీ తహశీల్దారు అబ్దుల్ రఫీ, ఫైర్ మేన్ వి. మురళీకృష్ణ, కోరమండల్ పేయింట్స్ కె.టి. నాయుడు, పోరస్ ల్యాబ్స్ అనిల్ బాబు, రూరల్ ఎస్.ఐ. టి. రామకృష్ణ, డిప్యూటీ ఛీఫ్ ప్యాక్టరీస్ ఎస్. ఉషశ్రీ , డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్ తదితరులు పాల్గొన్నారు .
Tags nuzividu
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …