అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి వర్దంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గురువారం మంగళగిరి కొత్త బస్ స్టాండ్ వద్ద గల వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా బాబు జగజీవన్ రామ్ విగ్రహనికి పూలమాలలు వేసి అనంతరం వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల జీవితాలు లేకపోవడం చాలా బాధాకరం అని, నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే విధంగా సామాన్య ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని , చెయ్యని వాటిని సైతం ప్రజా సంక్షేమం కోసం నిర్వర్తించిన మహామనిషి వైస్సార్ అని, తను నమ్మిన సిద్ధాంతం కోసం అనుక్షణం తపించిన మనిషి డాక్టర్ వైఎస్ఆర్ నమ్మిన రాష్ట్ర ప్రజలందరికీ బాగోగులు చూసి, వారి పిల్లల యొక్క చదువు గురించి అనుక్షణం ఆలోచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్, తద్వారా ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకు చదువు ఒక్కటే మార్గమని పునాది వేసిన వ్యక్తి వైస్సార్. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసానిస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి కొన్ని కోట్ల మందికి ఆపన్నహస్తం అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించి , రాష్ట్ర రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్. రాజశేఖర్ రెడ్డి మన జీవితాల్లో భౌతికంగా లేకపోయినా మనందరి గుండెల్లో, రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైయస్సార్ పాలన ఒక సువర్ణ అధ్యాయం గా చరిత్రలో మిగిలి పోతుంది. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఉండాలని మనమందరం అండగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …