జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత మహనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మారువలేనివని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. గురువారం జగ్గయ్యపేట పట్టణంలో వైయస్ఆర్ 12వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విలియంపేట, బలుసుపాడు రోడ్డు, కోదాడ రోడ్డు, బస్టాండ్ ఎదురుగా, బైపాస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి వైయస్ఆర్ విగ్రహాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Prajavartha Online Telugu News