Breaking News

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వ భూషణ్ హరిచందన్ వారి సందేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులందరికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా సేవలు అందించిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. డాక్టర్ రాధాకృష్ణన్ ఆదర్శప్రాయమైన విద్యావేత్త, పండితుడు, తత్వవేత్త, రచయిత. జీవితంలో ఉన్నత నైతిక విలువలను అలవర్చే
ఉపాధ్యాయులు మన సమాజానికి వాస్తుశిల్పులు. వారు దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారి సహకారం లేకుండా, ఏ సమాజమూ ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందదు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి వారు ఎంతో కృషి చేస్తారు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక, ఉపాధ్యాయుని సహకారం గుర్తించదగినది. కరోనా మహమ్మారి వల్ల విద్యా బోధనలో నెలకొంటున్న అంతరాయం నేపథ్యంలో ఆన్‌లైన్, డిజిటల్ తరగతులను నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయులు తమ విద్యా బాధ్యతలను నెరవేర్చడానికి చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను.” అని  గవర్నర్ పేర్కొన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్ ఆఫ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *