విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో కేంద్ర స్థాయిలో పైక్ తిరుగుబాటు గుర్తింపు పొందిందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య వేడుకను పురస్కరించుకుని ఫిక్కీ భువనేశ్వర్ (ఎఫ్ఎల్ఓ) శాఖ నిర్వహించిన వెబినార్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శనివారం సాయంత్రం విజయవాడ రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్‌లో గవర్నర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బుక్సి జగబంధు నేతృత్వంలో పైక్ తిరుగుబాటుకు దారితీసిన సంఘటనలను వివరించారు. 1997 లో ఒడిశాలోని జనతా పార్టీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు తాను సాంస్కృతిక శాఖ నిర్వహించానని, 8 సంవత్సరాల పాటు కొనసాగిన పైక్ తిరుగుబాటును మొదటి స్వాతంత్ర్య యుద్ధంగా గుర్తించటానికి చొరవ తీసుకున్నానని చెప్పారు. గజపతి మహారాజు కమాండర్-ఇన్-చీఫ్ బుక్సీ జగబంధు బ్రిటిష్ పాలకుల అణచివేత చర్యలను సహించలేకపోయాడని, రాష్ట్రంలోని పైకా అధిపతులందరినీ ఒకచోట చేర్చి జన విప్లవాన్ని ప్రారంభించారన్నారు. 1817 మార్చి 29న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒడిశాలోని సాధారణ ప్రజలు చేసిన పోరు మొదటి స్వాతంత్ర్య యుద్ధానికి దారితీసిందన్నారు. పైక్ తిరుగుబాటు ఒడిశాలోని సాధారణ ప్రజలు చేసిన ప్రజా యుద్ధమన్నారు రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ దిలీప్ టిర్కీ ప్రారంభోపన్యాసం చేయగా, భువనేశ్వర్ ఫిక్కీ ఎఫ్ఎల్ఓ ఛైర్‌పర్సన్ సునీతా మొహంతి, వైస్ చైర్‌పర్సన్ నమృత చాహల్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌పి సిసోడియా తదితరులు రాజ్ భవన్ నుండి వెబినార్‌కు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News