-ఇంటి పునాది పూర్తి అయిన వెంటనే తొలి విడత రూ. 60 వేలు విడుదల…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కింద పియంఏవై – వైఎస్సార్ ( అర్బన్ ) పథకం కింద ఇళ్ల నిర్మాణానికి స్టేజివారిగా చెల్లింపుకు ఇప్పటికే ఉన్న షెడ్యూల్ ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం సహాయంతో లబ్దిదారులు నిర్మించిన ఇళ్ల కోసం చెల్లింపు షెడ్యూల్ ను విడిగా చేర్చడం జరిగింది. ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షల యూనిట్ ధర చెల్లింపు షెడ్యూల్ లో సవరణలు చేశారు. స్వయం సహాయక పద్దతిలో ఆప్షన్ -1,2 కింద ఇళ్లు నిర్మించుకోనే లబ్ధిదారులు బేస్ మెంట్ లెవల్ పూర్తి చేస్తే వెంటనే 60 వేల రూపాయలు ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకే చెల్లిస్తుంది. రూఫ్ లెవల్ కు స్థాయికి రూ. 60 వేలు, రూఫ్ కాస్ట్ కు రూ. 30 వేలు, ఫినిషింగ్ పనులు పూర్తి అయిన పిమ్మటే రూ. 30 వేలు చెల్లిస్తారన్నారు. అదేవిధంగా అప్షన్ – 3 కింద మేసన్ (ఎఫై ఓ ద్వారా నిర్మించబడే ఇళ్లకు బేస్ మెంట్ లెవల్ పూర్తి చేసిన వెంటనే రూ. 60 వేలు, రూఫ్ లెవల్ కు స్థాయికి రూ. 60 వేలు, రూఫ్ కాస్ట్ ఫినిషింగ్ పనులు పూర్తి అయిన పిమ్మటే రూ. 60 వేల చొప్పున అందించబడతాయన్నారు. అందువల్ల జిల్లాలో ఆప్షన్-3 కింద గృహాలు నిర్మించే మేసన్/ ఎకైఓలు లబ్ధిదారులను గ్రూపులుగా ఏర్పాటు చేసి పనులు చేపట్టాలన్నారు. గ్రామ సర్పంచులు, కార్పొరేటర్లు లబ్ధిదారులను గ్రూపులు చేయడంలో చొరవ చూపాలన్నారు.