విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం న్యూ రాజరాజేశ్వరిపేటలో వినాయక చవితి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. అమరావతి కాలనీలోని క్షిప్ర గణపతి ఆలయంలో జరిగిన వేడుకలలో స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి రాజా రమేష్ తో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామి వారికి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నారు. గణనాధుని దివ్య ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లవేళలా ఇదే విధంగా ఉండాలని కాంక్షించారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా మట్టితో చేసిన సహజ సిద్దమైన ప్రతిమని పూజించడం అభినందనీయమని మల్లాది విష్ణు అన్నారు. అనంతరం ఆలయ అర్చకులను శాసనసభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆదినారాయణ, పఠాన్ నజీర్ ఖాన్, ప్రేమ్, శ్రీనివాసరెడ్డి, ఆలయ సభ్యులు సుబ్రహ్మణ్యం, రంగారావు, గోవింద్, మురళి తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …